బ్లాక్ లో కొనుక్కుని చూసేవాడిని: మహేష్ ( ఆడియో విడుదల ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: మహేష్‌బాబు, తమన్నా జంటగా నటించిన 'ఆగడు' చిత్ర పాటల విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ దసరా పండుగను రెండు వారాల ముందుగానే జరుపుకుందాం అంటూ మహేష్ ఇచ్చిన స్పీచ్ ఫ్యాన్స్ ను సంబరపడేలా చేసింది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి శంకర్, మహేష్ కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుందని మాట్లాడుకునేలా చేసారు.

మహేష్ మాట్లాడుతూ...శంకర్ పై తనకున్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. తను మద్రాస్ లో ఉన్నప్పుుడు ఆయన సినిమాలో ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాకులో కొనుక్కుని చూసేవాడిని అని చెప్పారు.

స్లైడ్ షోలో...విశేషాలు...ఫొటోలు

ఆవిష్కరణ

ఆవిష్కరణ

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. మహేష్‌బాబు స్వీకరించారు.

ప్రచార చిత్రాలు...

ప్రచార చిత్రాలు...

కృష్ణ, విజయనిర్మల ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు.

'ఆగడు'.. నాకు మరో మలుపు!

'ఆగడు'.. నాకు మరో మలుపు!

మహేష్‌బాబు మాట్లాడుతూ... ''నా సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన చిత్రం 'దూకుడు'. ఆ సెట్‌లో ఉన్నప్పుడే 'ఆగడు' పేరుతో మరొక సినిమా చేయాలనుకొన్నాం. ఇందులో నేను కనిపించే విధానం, సంభాషణలు చెప్పే తీరు కొత్తగా ఉంటాయి. నటుడిగా నాకు మరో కీలకమైన మలుపు అవుతుంది'' అన్నారు

 మహేష్ కంటిన్యూ చేస్తూ...

మహేష్ కంటిన్యూ చేస్తూ...

''మద్రాసులో ఉన్నప్పుడు శంకర్‌ సినిమా విడుదలవుతోందంటే తొలి రోజే వెళ్లి చూసేవాణ్ని. ఆయన మా వేడుకకి రావడం ఆనందంగా ఉంది. తమన్‌ కెరీర్‌లో 'ఆగడు' ఉత్తమ చిత్రం అవుతుంది. శ్రీనువైట్లతో పనిచేయడం హాయిగా ఉంటుంది. 'ఆగడు' అందరికీ నచ్చే మరో మంచి చిత్రం అవుతుంది. సెప్టెంబరు 19న విడుదల చేస్తున్నాం. పండగ మళ్లీ రెండు వారాల ముందే జరుపుకొంటాం'' అన్నారు.

శంకర్‌ మాట్లాడుతూ....

శంకర్‌ మాట్లాడుతూ....

''ఒక్కడు' తర్వాత మహేష్‌ నటించిన అన్ని సినిమాలూ చూస్తున్నా. మహేష్‌ తెరపై కనిపించే విధానం చాలా బాగుంటుంది. యాక్షన్‌, డ్యాన్స్‌, భావోద్వేగాలు పలికించడం... ఇలా ప్రతీదీ పక్కాగా చేస్తాడు. తమన్‌ నా 'బాయ్స్‌'లో నటించాడు. అప్పుడే నాకు ట్యూన్లు వినిపించేవాడు. ఇప్పుడు తను మంచి స్థాయిలో ఉండటం ఆనందంగా ఉంది అన్నారు.

శంకర్ కంటిన్యూ చేస్తూ...

శంకర్ కంటిన్యూ చేస్తూ...

'దూకుడు' నాకు ఇష్టమైన చిత్రం. శ్రీనువైట్ల ఆ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం నాకు బాగా నచ్చింది. అందులో బ్రహ్మానందం నటన బాగుంటుంది. ఆయన నా అభిమాన నటుడు. మరోసారి మంచి కలయికలో వస్తున్న 'ఆగడు' ప్రేక్షకాదరణ పొందాలని కోరుకొంటున్నా'' అన్నారు.

శ్రీను వైట్ల మాట్లాడుతూ...

శ్రీను వైట్ల మాట్లాడుతూ...

''మహేష్‌ని 'దూకుడు'లో పదిశాతం మాత్రమే చూశారు. ఇందులో వందశాతం చూస్తారు. అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన తెరపై కనిపించబోతున్నాడు'' అన్నారు శ్రీనువైట్ల.

నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ...

నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ...

''ఆగడు విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు'' అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర.

 తమన్ మాట్లాడుతూ...

తమన్ మాట్లాడుతూ...

ఇది నా మూడో సినిమా...మహేష్ తో...ఆగడు కి ఇలాంటి ఆల్బమ్ ఇవ్వటానికి మహేష్ బాబు గారే ఓ ఫోర్స్ అన్నారు. ఆజా సరోజా సాంగ్ ఈ ఆడియో లో నాకు బాగా నచ్చింది అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...

టీజర్స్ చూడగానే ఈ సినిమా ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ కాబోతోందనిపించదని అన్నారు. మహేష్ బాబు గారు ప్రేక్షకులు ఇచ్చే ప్రతీ పైసాకు న్యాయం చేస్తారు అన్నారు.

 బ్రహ్మానందం మాట్లాడుతూ...

బ్రహ్మానందం మాట్లాడుతూ...

పవర్ ప్యాకెడ్ హీరో, స్టైలిష్ హీరో మహేష్ అన్నారు. మహేష్ ని ఎలా చూపించాలో తెలిసిన వన్ అండ్ ఓన్లీ డైరక్టర్ శ్రీను వైట్ల అన్నారు. మహేష్ ని ఎలా బెండ్ చేయాలో శ్రీను వైట్లకు తెలుసు అన్నారు. ఈ సినిమాలో చేయటం తన అదృష్టం అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ...

సుకుమార్ మాట్లాడుతూ...

శ్రీనువైట్ల,మహేష్ ల సక్సెస్ అనేది ఆగదు..అది సాగుతూనే ఉంటుంది. మహేష్ తో వన్ సినిమా చేసిన ప్రతీ రోజు ..బ్రతికిన క్షణమే. నాకు ప్రతీ రోజు గుర్తుంది. సినిమా రిలీజైన వెంటనే...మరో సినిమా ఎప్పుడు చేస్తారు అని మహేష్ గారు అడిగారు అని గుర్తు చేసుకున్నారు. రెండు పాటలు విన్నాను...చాలా బాగా ఉన్నాయి అన్నారు.

కృష్ణ గారు మాట్లుడుతూ...

కృష్ణ గారు మాట్లుడుతూ...

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ వాట్ టుడూ...వాట్ నాట్ డూ అనే డైలాగు చాలా బాగుంది అంటూ ఆ డైలాగుని చెప్పి అభిమానులను ఆనందపరిచారు.

మీలో ఎవరు సూపర్ స్టార్ ఫ్యాన్

మీలో ఎవరు సూపర్ స్టార్ ఫ్యాన్

ఈ కాంటెస్ట్ లో విజేతని ఇదే స్టేజిపై ఎంపిక చేసారు. మహేష్, నమ్రత కలిసి ఎంపిక చేసారు. మహేష్ గారిని కృష్ణ గారు ఏమని పిలుస్తారు అన్నదో ప్రశ్న. నాని అని పిలుస్తారు అని చెప్పారు. కృష్ణ గారి సినిమాల్లో మహేష్ గారికి నచ్చిన సినిమా ఏది అన్నది..మహేష సమాధాన మిచ్చారు. అల్లూరి సీతారామరాజు అని చెప్పారు.అలాంటి ప్రశ్నల ద్వారా ఇదే వేదికపై సూపర్ ఫ్యాన్ ని ఎంపిక చేసారు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ కార్యక్రమంలో హీరో మహేష్‌బాబు, కృష్ణ, విజయనిర్మల, సుధీర్‌బాబు, దగ్గుబాటి సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, దర్శకులు శ్రీనువైట్ల, శంకర్‌, సంగీత దర్శకుడు తమన్‌, చిత్రయూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X