»   »  'దూకుడు'కి ఏ మాత్రం తగ్గదు... :మహేష్ బాబు

'దూకుడు'కి ఏ మాత్రం తగ్గదు... :మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Mahesh Babu's Aagadu to resume shooting
    హైదరాబాద్ : ''శ్రీను వైట్ల దర్శకత్వంలో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'దూకుడు'కి ఏ మాత్రం తగ్గదు...ఈ 'ఆగడు'' అంటున్నారు మహేష్ బాబు. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.


    దర్శకుడు చెబుతూ ''పూర్తి వాణిజ్య విలువలతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేష్‌ పాత్ర చిత్రణ కొత్తగా అనిపిస్తుంది''అన్నారు. ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్‌లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
    ''దూకుడు కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకొంటుంది''అని నిర్మాతలు చెప్పారు.ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి.

    సంక్రాంతికి 'నేనొక్కడినే' అంటూ ప్రేక్షకుల్ని పలుకరించాడు మహేష్‌బాబు. ఇప్పుడు మళ్లీ షూటింగులతో బిజీ అయిపోయాడు.
    హైదరాబాద్‌, గుజరాత్‌లలో చిత్రీకరణ జరుపుతారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

    English summary
    
 Mahesh Babu has resumed the shoots of his Aagadu, most awaited movie in Dookudu combination. During this Hyderabad schedule, Aagadu director Sreenu Vaitla is planning to shoot some of the important scenes in a specially erected court set at Saradhi Studios and a large set designed at Nanakramguda for the film. Aagadu makers are planning to complete the shooting as soon as possible and are keen to release the film for 2014 summer.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more