'ఆగడు' రెండో ది వచ్చేస్తోంది..బీ రెడీ

By Srikanya

హైదరాబాద్ : మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం మొదటి ట్రైలర్ ని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఇప్పుడు రెండో టీజర్ ని రెడీ చేస్తున్నారు. ఈ నెల తొమ్మిదిన మహేష్‌ జన్మదినం సందర్భంగా 'ఆగడు' రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. ఈ మేరకు వర్క్ జరుగుతోందని సమాచారం.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని కొండ ప్రాంతంలో 'ఆగడు' క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. విజయ్‌ మాస్టర్‌ నేతృత్వంలో మహేష్‌బాబు, సోనూసూద్‌పై ఫైట్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల ఎనిమిది వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఇది చూసినవారు మహేష్‌ ఒంటి మీద పోలీసు డ్రెస్‌ పడితే ఇక సినిమా రచ్చ రచ్చే అంటున్నారు.

Mahesh Babu's Aagadu Second teaser released on his birthday

ఇక ఫస్ట్ టీజర్ లో... ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూపులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది. తమన్నా హీరోయిన్ . 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X