twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీఎస్టీ వివాదం.. రూ. 35 లక్షలు వెనక్కి ఇచ్చేసిన మహేష్ బాబు, ఏం జరిగిందంటే?

    |

    సూపర్‌స్టార్ మహేబాబుకు మరోసారి జీఎస్టీ అధికారుల షాక్‌ అంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెళ్లువెత్తాయి.

    ఈ ఆరోపణలు రావడానికి కారణం... జనవరి 1 నుంచి జీఎస్టీ రేట్లు ప్రభుత్వం తగ్గించినప్పటికీ ఏఎంబీ సినిమాస్‌ వారు పాత రేట్లు కొనసాగించడమే. పొరపాటు ఎక్కడ జరిగిందో, ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ.. పాత రేట్లనే కొనసాగించడం ద్వారా వినియోగదారుల నుంచి దాదాపు 35 లక్షలపైనే అదనంగా వసూలు చేసినట్లు టాక్.

    అదనంగా వసూలైన మొత్తం రూ. 35.66 లక్షలు

    అదనంగా వసూలైన మొత్తం రూ. 35.66 లక్షలు

    ‘ఎఎంబి సినిమాస్' వారు పాత జీఎస్టీ రేట్లనే కొనసాగించడం వల్ల అదనంగా రూ. 35.66 లక్షలు వసూలు చేశారు. నిర్వహణ లోపం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది.

    తమది కాని లాభాన్ని ఇచ్చేసిన మహేష్ బాబు

    తమది కాని లాభాన్ని ఇచ్చేసిన మహేష్ బాబు

    ఎఎంబి సినిమాస్ యజమానులు మహేష్ బాబు, సునీల్ నారంగ్ తమది కాని లాభాన్ని గుర్తించి... జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన రూ. 35.66 లక్షలు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించారు.

    జిఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసలు

    జిఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసలు

    తమది కాని లాభాన్ని తిరిగి చెల్లించడంపై మహేష్ బాబు, సునీల్ నారంగ్‌పై జిఎస్టీ హైదరాబాద్ కమీషనరేట్ ప్రశంసలు గుప్పించింది. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలా బాధ్యతగా జిఎస్టీ వెనక్కు ఇవ్వలేదని, మహేష్ బాబు, సునీల్ నారంగ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది.

    సూపర్ స్టార్ సూపర్ స్టారే

    సూపర్ స్టార్ సూపర్ స్టారే

    మహేష్ బాబు, సునీల్ నారంగ్ తీసుకున్న నిర్ణయం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరులోని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులపై ప్రభావం చూపనుంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ ఏ విషయంలో అయినా సూపర్ స్టారే అని అభిమానులు అంటున్నారు.

    కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ రేట్లు

    కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ రేట్లు

    జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వచ్చాయి. రూ.100.. ఆ పైన టికెట్‌కు గతంలో 28 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. జనవరి 1 నుంచి 18 శాతానికి తగ్గింది. రూ.100 లోపు టికెట్‌పై ఉన్న 18 శాతాన్ని 12 శాతానికి తగ్గించారు.

    English summary
    Mahesh has given additional profit of 35.66 Lakhs that has been collected as a part of GST on ticket prices of AMB Cinemas to 'Consumer Welfare Fund of India'. GST Commisionerate appreciated Superstar Mahesh for this good gesture. GST Commissionerate in a statement appreciated Mahesh Babu, Sunil Narang of AMB Cinemas for being the first in the entire country to return the additional GST. They hoped that theatres in Delhi, Mumbai, Chennai, Bangalore too will follow this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X