బాహుబలి రికార్డు బ్రేక్.. తుడిచిపెట్టిన భరత్ అనే నేను.. బాక్సాఫీస్ వద్ద సునామే!

By Rajababu

Recommended Video

Barath Ane Nenu Hope To Cross Bahubali In Collections

శ్రీమంతుడు ఘన విజయం తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, సాంగ్స్ నంబర్స్‌కు విశేషమైన స్పందన వస్తున్నది. అయితే ఈ చిత్రం బాహుబలి రికార్డును తుడిచిపెట్టేసందుకు సిద్ధమవుతున్నది.

యూఎస్‌లో సరికొత్త రికార్డు

యూఎస్‌లో సరికొత్త రికార్డు

భరత్ అనే నేను చిత్రం ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నది. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం 2000 స్క్రీన్లలో ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. యూరప్ కాలమానం ప్రకారం 19వ తేది మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రీమియర్లు ప్రారంభమవుతాయి అని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

బాహుబలి కంటే ఎక్కువ

బాహుబలి కంటే ఎక్కువ

భరత్ అనే నేను చిత్రాన్ని యూఎస్‌లో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నది. ఓ తెలుగు సినిమా ఇంత భారీ ఎత్తున అత్యధిక లొకేషన్లలో రిలీజ్ కావడం టాలీవుడ్ చరిత్రలో ఇదే ప్రప్రథమం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రికార్డును కూడా భరత్ అనే నేను చెక్ పెట్టనున్నది.

బాక్సాఫీస్ వద్ద సునామీ

బాక్సాఫీస్ వద్ద సునామీ

యూఎస్‌లో కనీవినీ ఎరుగని విధంగా రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు తిరగరాస్తుందనే విశ్వాసాన్ని సినీవర్గాలు వ్యక్తం చేశాయి.

భరత్ బహిరంగ సభ

భరత్ బహిరంగ సభ

భరత్ అనే నేను చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను శనివారం హైదరాబాద్‌లోని లాల్ బహద్దూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భరత్ అనే నేను బహిరంగ సభగా పేర్కొంటున్నారు. ఈ ఆడియో పండుగకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 వచ్చాడయ్యో సామికి రికార్డు వ్యూస్

వచ్చాడయ్యో సామికి రికార్డు వ్యూస్

భరత్ అనే నేను సినిమాకు సంబంధించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ (గురువారం) సాయంత్రం 5 గంటలకు వచ్చాడయ్యో సామి అనే మూడో పాటను విడుదల చేశారు. ఆ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడగా... రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఇప్పటికే సుమారు 3 మిలియన్ల వ్యూస్ రావడం ఓ రికార్డు.

 తొలిసారి టాలీవుడ్‌లో కైరా

తొలిసారి టాలీవుడ్‌లో కైరా

భరత్ అనే నేను చిత్రం ద్వారా కైరా అద్వానీ తొలిసారి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. మహేష్ బాబుకు తండ్రిగా శరత్ కుమార్ నటిస్తున్నారు. శరత్ కుమార్ కెరీర్‌లోనే ఈ చిత్రం అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలువనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X