ఆరోజు ఉదయాన్నే'మహేష్ ప్రమాణ స్వీకారం'.. హెడ్ ఫోన్స్‌తో సిద్దంగా ఉండండి

Recommended Video

ఆరోజు ఉదయాన్నే'మహేష్ ప్రమాణ స్వీకారం'.. హెడ్ ఫోన్స్‌తో సిద్దంగా ఉండండి

మహేష్ బాబు-కొరటాల శివ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన తర్వాత.. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సినిమా పట్టాలెక్కి ఇన్ని రోజులవుతున్నా.. ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదని అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనుకున్నారో!.. మరేమో గానీ!.. మొత్తానికి ఫస్ట్ లుక్ డేట్‌తో పాటు టైమ్ కూడా ఫిక్స్ చేసేసింది 'భరత్ అనే నేను' చిత్ర యూనిట్..

జనవరి 26, ఉదయం 7గం.కి:

'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్‌కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. జనవరి 26వ తేదీ ఉదయం 7గం.కు ఈ చిత్ర 'ఫస్ట్ ఓత్'ని విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ ద్వారా తెలిపారు.

'ఫస్ట్ ఓత్' అంటే..:

'ఫస్ట్ ఓత్' అంటే..:

'ఫస్ట్ ఓత్' రిలీజ్ అనగానే చాలామందికి అదేంటో అర్థం కాలేదు. టీజర్ రిలీజ్ చేస్తారా?.. లేక ఏకంగా ట్రైలరే రిలీజ్ చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తింది. కానీ ఈ రెండు కాకుండా.. 'భరత్ అనే నేను'లో మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేసే ఆడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

హెడ్ ఫోన్స్‌తో సిద్ధంగా ఉండండి:

హెడ్ ఫోన్స్‌తో సిద్ధంగా ఉండండి:

జనవరి 26న అన్ని న్ని మేజర్ ఆడియో ఫ్లాట్‌ఫామ్స్‌లో 'ఫస్ట్ ఓత్' విడుదల కానుంది. ఈ ప్రమాణ స్వీకారం వినడం కోసం.. అంతా హెడ్ ఫోన్స్‌తో సిద్ధంగా ఉండండి అంటూ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.

 కాన్సెప్ట్ పోస్టర్:

కాన్సెప్ట్ పోస్టర్:

'ఫస్ట్ ఓత్' కాన్సెప్ట్ గురించి తెలియజేసేలా విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో మహేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న రఫ్ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.

అలాగే పోస్టర్ పై 'శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని..' అనే ప్రమాణ స్వీకార పాఠాన్ని పొందుపరచడం విశేషం.

 ఏప్రిల్‌లో విడుదల:

ఏప్రిల్‌లో విడుదల:

మహేష్ బాబు తొలిసారిగా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో 'భరత్ అనే నేను'పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' భారీ హిట్ సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X