మహేశ్‌కు మరో షాక్.. భరత్ అనే నేను ఫోటోలు లీక్.. ఇంటర్నెట్‌లో వైరల్..
Recommended Video

మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన చిత్రం భరత్ అను నేను. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. స్పైడర్ తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకొని షూటింగ్‌కు హాజరయ్యేందుకు మహేశ్ సిద్దం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను చిత్రంలోని ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయింది. ఈ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ముఖ్యమంత్రిగా మహేశ్
భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందనే ఫిలిం సర్కిల్ ప్రచారం అవుతున్నది. ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలా ఉంటాడు. పాత్ర స్వభావం ఎలా ఉంటుంది అనే అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది.

ప్రచారం చెయవద్దు
సీఎంగా మహేశ్‌బాబు లుక్‌కు సంబంధించి ఆసక్తి పెరిగిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఆ ఫోటోను ప్రచారం చేయవద్దని నిర్మాత, దర్శకులు కోరుతున్నారు.

సర్కులేట్ చేయడం ఆపేయండి
భరత్ అనే నేను చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ ఇంటర్నెట్‌లో లీకయ్యింది. ఈ స్టిల్ వైరల్ గా మారింది. అయితే ఈ లీకైన స్టిల్‌ను సర్కులేట్ చేయడం ఆపేయండి. దయచేసి ఎవ్వరూ పోస్ట్ చెయవద్దు. జట్టు సభ్యులంతా అభిమానులకు మంచి చిత్రాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాము'' అని కొరటాల శివ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

సెక్యూరిటీ సిబ్బందితో..
సినీ తెరపై రాజకీయ నాయకుడి పాత్రలో గతంలో దూకుడు చిత్రంలో నటించాడు. ఆ చిత్రంలో ఎమ్మెల్యేగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తొలిసారి మహేశ్ భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. తాజాగా లీకైన ఫోటోలో తన సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగత సహాయకులతో నడిచి వస్తున్న ముఖ్యమంత్రి మహేశ్‌బాబు చాలా స్మార్ట్ గా ఉన్నాడు.

గతంలో కూడా ఇంటర్నెట్‌లో
ఇటీవల ఈ చిత్రంలోని అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఫోటోలు కూడా వెబ్‌సైట్లలో ప్రచారం అయ్యాయి. అసెంబ్లీలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్న సన్నివేశం బయటకు వచ్చింది. ఆ ఫోటో అప్పట్లో అభిమానుల్లో చాలా ఆసక్తిని రేపింది.

వేసవి సెలవుల్లో విడుదల
ఇదిలా ఉండగా, భరత్ అనే నేను సినిమా షూటింగ్‌కు సంబంధించిన తర్వాత షెడ్యూల్ అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నదని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు పాల్గొంటారని తెలుస్తున్నది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి 2018 వేసవి సెలవుల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











