twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "భరత్ అనే నేను" మరో మెర్సల్ కానుందా? మెయిన్ పాయింట్ మన ఎడ్యుకేషన్ సిస్టమే!?

    భరత్ అనే నేను సినిమా మరో మెర్సల్ కానుందా? అన్న అనుమానం వస్తోంది. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ ఒకటి సినిమా స్థాయిని పెంచేస్తుందట.

    |

    Recommended Video

    మరో మెర్సల్ కానున్న మహేష్ మూవీ ?

    కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా కనిపించ‌నున్నాడు.

     మహేష్ బాబు సీఎం‌గా

    మహేష్ బాబు సీఎం‌గా

    స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా యూనిట్. ఇందులో మహేష్ బాబు సీఎం‌గా కనిపించబోతున్నాడన్న విషయమే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.

    మహేష్ బాబు ముఖ్యమంత్రిగా

    మహేష్ బాబు ముఖ్యమంత్రిగా

    అయితే ఈ సినిమా విషయం లో వినిపిస్తున్న వార్త ఒకటి ఆసక్తి కరంగా ఉంది కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్ ఒకటి సినిమా స్థాయిని పెంచేస్తుందట.

    నెలకొన్న సమస్యల ప్రస్తావన

    నెలకొన్న సమస్యల ప్రస్తావన

    రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాలో ప్రస్తుతం నెలకొన్న సమస్యల ప్రస్తావన ఉంటుందట. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ కి సంబందించిన సీన్స్ సినిమాకి ప్రధాన బలమని చెబుతున్నారు.

    మరో మెర్సల్ కానుందా?

    మరో మెర్సల్ కానుందా?

    ఇదైతే వినటానికి బాగానే ఉంది కానీ ఈ సినిమా మరో మెర్సల్ కానుందా? అన్న అనుమానమూ వస్తోంది, మొన్నటికి మొన్న తాజా పరిస్థితులమీద వచ్చిన తమిళ సినిమా మెర్సల్ ఎంతటి వివాదాస్పదం అయ్యిందో చూసాం కదా. ఇప్పుడు భరత్ అనే నేను లో కూడా ఇలాంటి ఎలిమెంట్ నే మెయిన్ పాయింట్ గా తీసుకోవటం, గవర్నమెంట్, ప్రస్తుత రాజకీయాల మీద సెటైర్గా వస్తోన్న మహేష్ సినిమా తెలుగులో మరో మెర్సల్ అవుతుందా అన్న అంశం కాస్త కలవర పెడుతోంది.

    శ్రీమంతుడు

    శ్రీమంతుడు

    కొరటాల తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటాడు. ఇక శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ సినిమాల్లో కూడా సామాజిక అంశంతో కూడిన సన్నివేశాలను చూపించాడు. అయితే ఇప్పుడు పూర్తిగా కొరటాల సోషల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సన్నివేశాలనే ఎక్కువగా హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

    English summary
    Bharat Ane Nenu focuses on many burning issues that are grappling the modern-day society. Among many issues that are showcased in the film, education system is said have given thorough importance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X