పవన్ రికార్డు బద్దలు కొట్టిన మహేష్: 'భరత్ అనే నేను' దుమ్మురేపిందిగా!..
సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' మరో రికార్డు సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా అత్యధిక లైక్‌లు సాధించిన టీజర్‌గా కొత్త రికార్డు సృష్టించింది.
అంతకు ముందు ఈ రికార్డు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పేరిట ఉండేది. ఇప్పుడా రికార్డును 'భరత్ అనే నేను' బ్రేక్ చేసింది. ఈ సినిమా టీజర్‌కు ఇప్పటిదాకా కోటి 32లక్షలకు పైగా వ్యూస్, 5.26 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి.

'చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే నువ్వు మనిషివి అనిపించుకోవని..' అంటూ టీజర్‌లో మహేష్ చెప్పిన డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మహేష్ సీఎం పాత్రలో కనిపించబోతున్నాడు. సమకాలీన రాజకీయ అంశాలను మేళవిస్తూ తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
More from Filmibeat
mahesh babu bharath ane nenu pawan kalyan agnyaathavasi koratala siva మహేష్ బాబు కొరటాల శివ పవన్ కల్యాణ్ భరత్ అనే నేను


Click it and Unblock the Notifications











