»   » మహేష్ బాబు '1 .. నేనొక్కడినే' కొత్త టీజర్

మహేష్ బాబు '1 .. నేనొక్కడినే' కొత్త టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ ఈ రోజున తన పుట్టిన రోజుని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తటీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ఈ రోజు ఉదయమే రిలీజ్ చేసారు. విడుదల చేసిన క్షణాల్లోనే అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వైరల్ గా అంతటా కనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన అభిమానులు సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం నిమిత్తం విడుదల చేసిన కొత్త పోస్టర్ మీరు ప్రక్కన చూస్తున్నది. మహేష్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌కృష్ణ, కూతురు సితార కూడా ప్రస్తుతం లండన్‌లో ఆయనతోనే ఉన్నారు. గత నెల్లో తన కూతురు సితార మొదటి పుట్టినరోజుని లండన్‌లోనే జరిపిన మహేశ్ ఈపారి తన పుట్టినరోజుని కూడా అక్కడే జరుపుకోవడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ' 1 .. నేనొక్కడినే' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రైలర్:
<center><center><iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/T0S4YoGbSJk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center>

తను నటిస్తున్న '1.. నేనొక్కడినే' చిత్రం షూటింగ్ కోసం గత 30 రోజులనుంచి లండన్‌లోనే మహేశ్ ఉన్న సంగతి విదితమే . మరో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే జరగనుంది. '1'(నేనొక్కడినే) చిత్రం బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ 20 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు.

మహేష్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వన్‌' ప్రచార చిత్రాన్ని ఆ మధ్యన విడుదల చేశారు. ఈ టీజర్‌ మహేష్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకొంది. పది లక్షల మంది యూట్యూబ్‌లో ఈ ప్రచార చిత్రాన్ని తిలకించారు. ఈ సంఖ్యలో ఓ ప్రచార చిత్రాన్ని తిలకించడం తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ అరుదైన విషయమే. ఇప్పుడు ఈ టీజర్ ...కూడా అదే రేంజిలో వీక్షకుల అభిమానం పొందుతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu's fans received a gift on the superstar's birthday today(9th August). The new trailer of Mahesh Babu starrer 1 Nenokkadaine released on his birthday.The makers announced that the new trailer would be released on the occasion of Mahesh's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu