ఇదే నిజం: మహేష్ సీక్రెట్..స్వయంగా చెప్పేసాడు,,మీకూ ఉపయోపడుతుంది
హైదరాబాద్ : మహేష్ బాబు...ఆయన్ను తలుచుకోగానే, మొదటగా ఆయన సినిమాల గురించి కాకుండా ఆయన చాక్లెట్ లుక్స్ మన మనస్సులో మెదులుతాయి. అంతేనా ఆయన సినిమాలు వరసగా చూసేవారికి మరో విషయం అర్దం అవుతోంది. ఆయన తన శరీరాన్ని కానిస్టెంట్ గా ఒకే విధంగా మెయింటైన్ చేయటం గమనించవచ్చు. మార్పు లేని విధంగా ఎన్నో సంవత్సరాలు అయినా ఆయనలో మార్పు రావటానికి కారణం ఏమిటి..సీక్రెట్ ఏమిటి...
ఈ క్రెడిట్ మొత్తం మహేష్ బాబు రెగ్యులర్ గా జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ లకు చెందుతుందా... అవుననే అంటున్నారు మహేష్ బాబు. అంతేకాదు...అంత అందంగా ఆయన కనపడటానికి కారణం మరొకటి ఉందని చెప్పారు. ఆయన తమ బాడీ సీక్రెట్స్ సస్పెన్స్ ని చెప్పేసారు. మీరు మెయింటైన్ చేస్తే మహేష్ లాగ అందంగా కనపడవచ్చు అని చెప్తున్నారు.
అవునూ ..మహేష్ వయస్సు ఎంత...మీరు చెప్దామనుకునేంత తక్కువైతే కాదు. మరెంత అంటే...గూగుల్ సెర్చే చేయకండి..మేమే చెప్పేస్తా... ఆయన వయస్సు నలభై. నమ్మనంటారా..ఇప్పుడు చెక్ చేయండి ఆయన పుట్టిన రోజు డేట్. ఏమిటి ...నలభై సంవత్సరాల వయస్సులో అంత చిన్న ఏజ్ వాడులా ఎలా కనపడుతున్నాడు... మరి అదే ఆ సీక్రెట్సే మీకు ఈ రోజు అందిస్తున్నా...
మహేష్ పర్శనల్ ట్రైనర్ మన్నవ మాట్లాడుతూ... "చాలా మంది నటులు తాము చేయబోయే చిత్రంలో పాత్ర కోసం...వర్కవుట్ చేస్తూంటారు. కానీ మహేష్ బాబు అలా కాదు. ఆయన సంవత్సరంలో 365 రోజుల్లో ఒక్క రోజు కూడా జిమ్ ని మిస్ అవటానికి ఇష్టపడరు. ఆయన ఫోకస్ అంతా సన్నగా ఉండటం, మంచి కండలు బిల్డ్ చేయటం. బలంగా ,ఫ్లెక్సిబులిటీగా శరీరం ఉండాలని ఆయన కోరుకుంటారు ."చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో..మహేష్ బ్యూటీ సీక్రెట్స్...

అలా అనుకుంటేనే....
వయస్సు అనేది నా దృష్టిలో ఒక నంబర్ మాత్రమే. లోపల మనం ఎలా ఉన్నాం? అన్నదే ముఖ్యం.మీరు బయటకు ఎలా కనిపిస్తున్నారు? అనేది మీ మనస్సును బట్టే ఉంటుంది అని మహేష్ బాబు చెప్పారు.

అదే బయిటకు కనిపిస్తోంది.
ప్రస్తుతం నేను 'హ్యాపీ స్పేస్'లో ఉన్నా. అదే బయటికి కనిపిస్తోంది'' అని మహేశ్ అన్నారు.

'హ్యాండ్‌సమ్ లుక్స్ వెనక సీక్రెట్?' అంటే...
''ప్రతిరోజూ వర్కవుట్ చేస్తాను. ఆరోగ్యం మీద నాకు శ్రద్ధ ఎక్కువ. ఆహారం విషయంలో పద్ధతులు పాటిస్తా.

ఫుడ్ అలవాట్లు
''కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్.. ఇవి ఎంతవరకూ కావాలో అంతే తీసుకుంటాను.ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, ఆకుకూరలు బాగా తింటా'' అన్నారు మహేష్ బాబు.

మెయిన్ సీక్రెట్..
''బాగా తినండి.. హాయిగా నిద్రపోండి.. ఫిట్‌గా ఉండండి'' అంటూ మహేశ్ చెప్పారు.

స్లైల్ మంత్ర
''నాకు ఫార్మల్స్ లో ఉండటమే ఇష్టం. సింపుల్‌గా ఉంటే నాకు సౌకర్యవంతంగా ఉంటుంది.నా స్టైల్ మంత్ర ఏంటంటే... క్యాజువల్'' అని సింపుల్‌గా అన్నారు.

సినిమాల్లో ఎప్పుడు చొక్కా విప్పుతారు?
''కథ డిమాండ్ చేస్తే.. అప్పుడలా కనిపిస్తానేమో'' అన్నారు.

మహేష్ ని ఎట్రాక్ట్ చేసే అమ్మాయి..
''ఆకర్షణ... చమత్కారం... తెలివితటేలు... ఈ మూడూ ఉండాలి ఉన్న అమ్మాయిలు నచ్చుతారు'' అన్నారు.

ప్రస్తుతం
మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నారు. ఈ సమ్మర్ లోనే చిత్రం రిలీజ్ అవుతుంది.

తదుపరి చిత్రం
మహేష్ బాబు తదుపరి చిత్రం తమిళ దర్శకుడు మురగదాస్ డైరక్షన్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











