twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్ గెలుపుపై సూపర్ స్టార్ మహేష్ బాబు రెస్పాన్స్

    |

    భారీ ఉత్కంఠ నడుమ నిన్న (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెహన్ రెడ్టి ఊహించని మెజారిటీతో భారీ విజయం సాధించారు. పోటీ చేసిన మొత్తం స్థానాల్లో ముప్పావు వంతు స్థానాలను చేజిక్కించుకున్నారు. ఈ విజయం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గద్దెదింపి ఏపీ కొత్త సీఎంగా అవతరించబోతున్నారు వైఎస్ జగన్. మరోవైపు దేశంలో బీజేపీ హవా కొనసాగింది. మళ్లీ మోదీనే ప్రధాని కావాలని కోరుకున్నారు దేశ ప్రజలు.

    పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్.. మద్యం, మానవత్వం అంటూపవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్.. మద్యం, మానవత్వం అంటూ

    ఈ నేపథ్యంలో కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ప్రధాని మోడీకి ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారి విజయంపై స్పందించగా తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తనదైన కోణంలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ''అధ్బుతమైన విక్టరీ కొట్టేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ ఆధ్వరంలో రాష్ట్రం ప్రగతి పథాన దూసుకెళ్లాలని కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశారు మహేష్. ఆ వెంటనే ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. ''మోదీజీ మీ విజయానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం ఇలాగే ఎంతో కాంతి వంతంగా ముందుకెళ్లాలని కోరుతున్నా'' అని మరో ట్వీట్ చేశారు మహేష్. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Mahesh Babus comments on Y. S. Jaganmohan Reddy

    మహేష్ బాబు గత చిత్రం 'భరత్ అనే నేను'లో యంగ్ సీఎంగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా పోలీషియన్స్‌కి మంచి సందేశమిచ్చారు. దీంతో రియల్ యంగ్ సీఎం జగన్‌కి రీల్ యంగ్ సీఎం శుభాకాంక్షలు అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ఇక మహేష్ నటించిన తాజా సినిమా మహర్షి విజయవంతంగా ప్రదర్శించబడుతూ మహేష్ లో అరుదైన రికార్డులను చేరుకుంటోంది. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా తెరకెక్కనుంది.

    English summary
    In 2019 Ap Elections Ysr cp got prestigious win. Super star Mahesh Babu comments on this victory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X