మహేష్ కూతురితో దేవిశ్రీ రచ్చ చూశారా.. క్రేజీ న్యూస్ చెప్పాడు!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ లోనే విడుదల కావలసిన మహర్షి చిత్రం మే నెలకు వాయిదా పడడంతో మహేష్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. వారికి హుషారు తెప్పించే క్రేజీ న్యూస్ ని దేవిశ్రీ తాజాగా ప్రకటించాడు.
మహర్షి సందడి షురూ
దిల్ రాజు ఇటీవల మీడియా సమావేశంలో మహర్షి చిత్రాన్ని మే 9న విడుదల చేస్తాం అని ప్రకటించారు. విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు. త్వరలో మహర్షి సందడి షురూ కాబోతోంది. మహర్షి చిత్రంలోని తొలి పాటని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ ట్విటర్ ద్వారా ప్రకటించారు.

సితార మరో వీడియో
మహేష్ కుమార్తె సితార ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. సితార క్యూట్ వీడియోలని మహేష్, నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల సితార బాహుబలి సాంగ్ కు డాన్స్ చేసిన వీడియోని మహేష్ పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా మరో సాంగ్ కు సితార డాన్స్ చేసింది. ఈ వీడియోని దేవిశ్రీ ప్రసాద్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
దేవిశ్రీతో కలసి రచ్చ
ఈ వీడియోలో సితార శ్రీమంతుడు చిత్రంలో చారు శీలా.. స్వప్న బాల అనే సాంగ్ కు తన స్నేహితురాలితో కలసి డాన్స్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటని పడుతుండగా సితార క్యూట్ స్టెప్పులతో ఆకట్టుకుంది. సితార ఎనేర్జికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా దేవిశ్రీ, మహేష్ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. మహర్షి చిత్రానికి కూడా అభిమానులు అరిదిరిపోయే ఆల్బమ్ ని ఆశిస్తున్నారు.

వరుస చిత్రాలతో
మహేష్ వరుస చిత్రాలతో అభిమానులని అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మహర్షి చిత్రం పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రాన్ని మహేష్ ప్రారంభించనున్నాడు. మహర్షి చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











