మా అన్నయ్య పెద్ద 'ఫ్యామిలీ గయ్'.. వైరల్ అవుతున్న మహేష్ కుమార్తె సితార వీడియో!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రం నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా మహేష్ తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారు. మహేష్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో దుబాయ్ వెకేషన్ లో ఉన్నాడు. మహేష్, నమ్రత ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ పిల్లల విశేషాలని అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా మహేష్ తన కుమార్తె సితార వీడియోని పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ముద్దు ముద్దుగా ఇంగ్లీష్ మాటలు
సితార తన సోదరుడి గురించి ఈ వీడియోలో మాట్లాడింది. ముద్దు ముద్దుగా సితార మాట్లాడిన ఇంగ్లీష్ మాటలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. తన సోదరుడు గౌతమ్ ని ఆటపట్టించడానికే సితార ఈ వీడియో చేసినట్లు ఉంది. ఆరేళ్ళ సితార ఇంగ్లీష్ లో అదరగొడుతోంది. మహేష్ ఎక్కువగా సితారని గారాబం చేస్తున్న దృశ్యాలు తరచుగా చూస్తూనే ఉన్నాం.
అన్నయ్య గురించి
సితార ఈవీడియోలో ఏం మాట్లాడిందంటే.. హాయ్.. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చా. ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా అన్నయ్య గౌతమ్ ఒక పెద్ద ఫ్యామిలీ గయ్ అని చెప్పింది. ఎప్పుడూ పెద్దవారినే అంటిపెట్టుకుని ఉంటాడనే విధంగా సితార మాట్లాడింది. మహేష్ ఈ వీడియోని పోస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మహర్షితో బిజీగా
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల మహర్షి సెకండ్ లుక్ ని కూడా విడుదల చేశాడు. మహేష్ బాబు బడా వ్యాపారవేత్త తరహాలో ఉన్న ఈ లుక్ అభిమానులని ఆకట్టుకుంది. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

సుకుమార్ చిత్రానికి సన్నాహకాలు
మహర్షి చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ సుకుమార్ చిత్రంతో బిజీ కానున్నాడు. జూన్ నుంచి మహేష్, సుకుమార్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు లేటెస్ట్ టాక్. మైత్రి మూవీస్ ఈచిత్రాన్ని నిర్మించబోతోంది. 1 నేనొక్కడినే తర్వాత మహేష్, సుకుమార్ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











