రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రిన్స్ మహేష్ ‘దూకుడు’
అన్యాయాన్ని ఎదిరిస్తూ ఇప్పుడు తాను చేసేపని వందేళ్ళు గడిచినా అందరూ గర్వంగా తన గురించి చెప్పుకొనే విధంగా వుండాలనుకొంటాడు ఆయువకుడు.అలాగే తాను వేశే ప్రతి అడుగూ ఒక చరిత్ర సృష్టించాలని అనుకొంటాడు.సాహసమే సోపానంగా చేసుకొని ఆ యువకుడు వేశే అడుగులో వున్న లక్ష్యం ఏమిటి ?అలాగే ఆ లక్ష్యం కోసంగా ఆయువకుడు చేసిన సాహసాలు ఏమిటనేవి మహేష్ బాబు కథానాయకుడుగా నటిస్తున్న " దూకుడు " చిత్రం చూస్తే తెలుస్తుందని చెబుతున్నారు ఈ చిత్ర నిర్మాతలు.
మహేష్ బాబు కథానాయకుడుగా,సమంత కథానాయకిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం "దూకుడు " ఈ చిత్రం రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ,అనీల్ సుంకర నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకొంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకొంటుంది.త్వరలో ఈ చిత్ర పాటలను విడుదల చేయబోతున్నారు. యాక్షన్, వినోదం,సంగీతం ఈ మూడూ సమపాళ్ళలో కలిపి ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంది.మహేష్ బాబు ఈ చిత్రంలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు.మహేష్ బాబు నటనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఈ చిత్రనిర్మాతలు తెలిపారు.త్వరలోనే ఈ చిత్ర ఆడియోని విడుదల చేసి తదుపరి ఈ సినిమాని విడుదల చేయాలని అనుకొంటున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











