»   » నిజంగానే.... గెస్ట్ రోల్‌లో మహేష్‌బాబు

నిజంగానే.... గెస్ట్ రోల్‌లో మహేష్‌బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన మహేష్...మణిరత్నం దర్శకత్వంలో ఓ పీరియడ్ చిత్రంలో చేస్తాడు. అందులో రాజకుమారుడుగా మహేష్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. మహేష్ సైతం ఆ ప్రాజెక్టు మీద చాలా ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది.

అబిమానులు ...మహేష్ ని రాజకుమారుడు గా చూడాలనే కోరిక తీరలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు మహేష్ అటువంటి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. . ఇప్పుడు అనుష్క 'రుద్రమదేవి'లోనూ ఓ ప్రత్యేక అతిథి ఉన్నారట. ఆ పాత్రలో ఓ ప్రముఖ హీరో కనిపిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం మహేష్‌బాబుని సంప్రదించారట.

గుణశేఖర్‌ - మహేష్‌బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి మహేష్‌బాబు కూడా పచ్చజెండా వూపారని సమాచారం. మహేష్‌ ఓ రాకుమారుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి.

మిగతా కథనం స్లైడ్ షో లో...

ఆ క్రేజే వేరు

ఆ క్రేజే వేరు

ఈ మధ్య కాలంలో అతిథి పాత్రల హంగామా ఈ మధ్య జోరందుకొంది. తమ చిత్రంలో ఓ స్టార్ హీరో..గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే ఆ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. సినిమాలో ఎంత సేపు ఉంటాడు..ఏ పాత్రలో కనిపిస్తాడు అనేది ప్రక్కన పెడితే సినిమాలో కనపడటమే హైలెట్ గా చెప్పుతున్నారు. కాబట్టి మహేష్ పాత్రకు మంచి క్రేజ్ వస్తుంది. అందులోనూ రాజకుమారుడు గెటప్ కి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.

పవన్ తో పాటు...

పవన్ తో పాటు...

మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ...అత్తారింటికి దారేది చిత్రంలోనూ..మహేష్ కనిపించనున్నాడని రూమర్స్ గత కొద్ది రోజులుగా వినపడుతున్నాయి. ఆ చిత్రం ఆడియోలో ఓ పాట విడుదల చేయలేదని,బ్రహ్మానందం చెప్పి మరీ ఆ రూమర్ కి బలం చేకూర్చారు. ఇప్పుడు అత్తారింటికి దారేది చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అయితే గానీ మహేష్ ఉన్నాడా లేడా అనేది తెలియదు.

జల్సా లో వాయిస్ ఓవర్ లోనూ..

జల్సా లో వాయిస్ ఓవర్ లోనూ..

జల్సా చిత్రంలోనూ మహేష్ వాయిస్ కోసం మహేష్ అభిమానులు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. పవన్ స్టామినాకు మహేష్ మ్యాజిక్ తోడవటంతో ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధంతో,పవన్ తో ఉన్న స్నేహంతో మహేష్ ఆ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాయిస్ కే అంత క్రేజ్ ఉంటే..ఇక పవన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తే...అనేది...హిట్ కాన్సెప్టు.

సమంత గెస్ట్ గా...

సమంత గెస్ట్ గా...

రీసెంట్ గానే సిద్దార్ద,హన్సిక కాంబినేషన్ లో వచ్చిన ... 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'లో రానా, సమంత చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. సిద్దార్దకు సమంతకు ఉన్న అనుభంధంతోనే ఇలా కనపడ్డారని చెప్పుకున్నారు. సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా... ఓపినింగ్స్ మాత్రం ఆ టాక్ ఎంతో కొంత ఉపయోగపడిందనేది నిజం.

అల్లు అర్జున్ కూడా...

అల్లు అర్జున్ కూడా...

మరో ప్రక్క ఓ వారంలో విడుదల అవుతున్న 'ఎవడు' సినిమాలో అల్లుఅర్జున్‌, కాజల్‌ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ పాత్రే సినిమాకు కీలకమని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. బన్ని తప్పితే మరెవరూ ఆ పాత్ర చెయ్యలేరని మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ రకంగా బన్ని అభిమానులు సైతం...సినిమా కోసం క్యూ కట్టడం ఖాయం.

భారీ అంచనాలకై...

భారీ అంచనాలకై...

ఇక 'రుద్రమదేవి' విషయానికి వస్తే.,....గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రానా, కృష్ణంరాజు, నథాలియా కౌర్‌, బాబా సెహగల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మహేష్‌బాబు కూడా చేరితే ఈ సినిమా ఇంకాస్త ఆసక్తిని పెంచుతుందంటున్నారు. భారీ సెటప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

English summary
According to film sources say that Mahesh Babu will be have a guest role apperance in Rudma Devi movie for a fight Sequence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu