»   » మహేష్ సంపాదనలో చారిటీకి పోయేదెంత?

మహేష్ సంపాదనలో చారిటీకి పోయేదెంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. అలుపు లేకుండా, విరామం లేకుండా ఎప్పుడూ సినిమాలు, యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎప్పుడో రేర్‌గా తప్ప బయట కార్యక్రమాల్లో, పంక్షన్లలో ఆయన అసలు కనిపించరు. ఆయనకు సంపాదనే తప్ప వేరే ధ్యాస లేదనే వారూ ఉన్నారు.

కానీ బయటకు తెలియని ఎన్నో విషయాలు మహేష్ బాబు సంపాదన వెనక ఉన్నాయి. ఆయన సంపాదిస్తున్న దాంట్లో 30 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇదంతా ఓల్డేజ్ హోమ్స్, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలు నమ్రత దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఈ విషయాలు నటుడు కమెడియన్ అలీ ఇటీవల ఓకార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు.

Mahesh Babu

మహేష్ బాబు తాజా సినిమా వివరాల్లోకి వెళితే...
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు తల్లి పాత్రకు నటి సుకన్యను ఫైనల్ చేసారు. ఇంతకు ముందు ఈ పాత్రకు గ్రేసీ సింగ్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ చివరకు సుకన్యను ఫైనల్ చేసారు. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తున్నారు.

నిన్నటితరం హీరోయిన్లలో ఒకరైన సుకన్య గతంలో పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘పెద్దరికం' చిత్రంలో జగపతిబాబుకు జోడీగా నటించింది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తాజాగా మహేష్ బాబు చిత్రంలో కూడా ఆమె జగపతి బాబు భార్య పాత్రలో నటిస్తుండటం విశేషం.

ఇందులో మహేష్ బాబుకు జోడీగా శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా ఫ్యామిలీ అండ్ మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Ali is supposed to have revealed that Mahesh stated, "30% of my earnings go for the charity work Namrata undertakes for helping old-age homes and homeless kids. Only to support this charity work I'm running from pillar to post to earn more".
Please Wait while comments are loading...