For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ కొత్త మూవీ స్టిల్స్ మళ్ళీ లీకయ్యాయి...(ఫొటోలు)

  |

  మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్లో దాదాపు 70-80 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళం లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని జనవరి చివరి వారం వరకు పూర్తి చేసి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మురుగదాస్ భావిస్తున్నాడు. కాగా షూటింగ్ ను కూడా అదే స్థాయిలో స్పీడ్ గా కానిస్తున్నాడు..

  ఈ చిత్రానికి ఇదే టైటిల్ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారం జరుగుతూ వస్తూనే ఉన్నాయి. తాజాగా 'ఏజెంట్ శివ'' అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చి హల్‌చల్ చేస్తోంది.ఈ చిత్రం లో మహేష్ బాబు ఐబీ అధికారిగా కనిపిస్తుండడం , అలాగే శివ అనే రోల్ పోషిస్తుండడం తో ఈ సినిమాకు 'ఏజెంట్ శివ'' అని పెట్టారని వినిపిస్తుంది. మరి ఈ టైటిల్ అయినా ఒకే చేస్తారో లేదు చూడాలి.

  ముంబై నేపథ్యంలో:

  ముంబై నేపథ్యంలో:

  తెలుగు.. తమిళ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించి, హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నాడు. కథ పూర్తిగా ముంబై నేపథ్యంలో కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థపై హీరో ఉక్కుపాదం మోపే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ తెలిపారు. ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

  జీటీవీ వారు భారీ డీల్:

  జీటీవీ వారు భారీ డీల్:

  ఈ సినిమాకు సంబంధించి జీటీవీ వారు భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ 26 కోట్ల రూపాయలనే ప్రచారం జరుగుతోది. ఇందులో 21 కోట్లు తెలుగు, తమిళం శాటిలైట్ రైట్స్ కు కాగా ఐదు కోట్లు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద తీసుకున్నట్లు టాక్.'ఏజెంట్ శివ' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ :

  దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ :

  తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు.ఈ మధ్య తెలుగులో సినిమా మేకింగ్ వీడియోలను, టీజర్లను వర్చువల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. మహేష్-మురగదాస్ కాంబినేషన్ మూవీ టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయిందట.

  ఇంటెలింజెన్స్ ఆఫీసర్:

  ఇంటెలింజెన్స్ ఆఫీసర్:

  ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటెలింజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. అందుకు 'ఏజెంట్ శివ' టైటిల్‌పై మహేష్ ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇదే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మురుగదాస్ ఉన్నట్లు చిత్రానికి సంబంధించిన సభ్యుల ద్వారా తెలుస్తోంది. మహేష్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తుంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

  ఫోటోలు లీక్ అయ్యాయి:

  ఫోటోలు లీక్ అయ్యాయి:

  ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఇంకా తాము ఫస్ట్ లుక్ ఇవ్వకుండానే.. పటిష్టమైన చర్యలకు కేంద్రం సిద్ధమని.. చెప్పిన దర్శకుడు మురుగదాస్ అక్కడి నుంచి కాసింత సెక్యూరిటీ పెంచేశాడు.ఇప్పుడు సడెన్ గా మహేష్ బాబు కొత్త స్టిల్స్ నెట్ లో దర్శనమిచ్చేశాయి. ఒకటీ అరా కాదు.. ఓ నాలుగైదు ఫొటోలునెట్లో వచ్చి పడ్దాయి.

  హెయిర్ స్టైల్ కూడా కొత్తగా:

  హెయిర్ స్టైల్ కూడా కొత్తగా:

  మహేష్ బాబు బస్ లోంచి దిగి వచ్చి.. అక్కడ ఉన్న వారందిరినీ విష్ చేసి వెళ్లిపోవడం కనిపిస్తుంది. మురుగదాస్ సినిమాలో మహేష్ లుక్ ఇప్పటికే తెలిసిపోయినా.. ఈ సారి మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ట్రైచేశాడు. క్లాస్ గా కనిపిస్తున్నా.. మాస్ ను ఒప్పించేందుకు తగినంతగా కష్టపడ్డ దర్శకుడు మహేష్ గెటప్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

   అభిమానులే :

  అభిమానులే :

  రీసెంట్‌గా సినిమా టైటిల్స్‌ని అంద‌రికంటే ముందే అభిమానులే అనౌన్స్ చేస్తున్నారు. వ‌చ్చిన లీక్‌ల‌పై వెంట‌నే స్పందించి పోస్ట‌ర్‌ల‌ను త‌యారు చేస్తున్నారు. ఇది ఓ ట్రెండ్‌. గ‌తంలో అత్తారింటికి దారేది, ఆర్య 2 వంటి చిత్రాల టైటిల్స్ విష‌యంలో ఇలానే జ‌రిగింది. స‌రిగ్గా రెండు నెల‌ల క్రితం.. చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 మూవీ టైటిల్‌ని కూడా ముందుగా అభిమానులే లీక్ చేశారు.

  ఏజెంట్ శివ:

  ఏజెంట్ శివ:

  ఆ త‌ర్వాత టైటిల్ ఇదేనంటూ సినిమా యూనిట్ క‌న్‌ఫ‌మ్ చేసింది. మహేష్‌-మురుగ‌దాస్ మూవీ టైటిల్‌ది కూడా సేమ్ సీన్ అనే ప్ర‌చారం సాగుతోంది.ఈ సినిమాకి మొద‌ట శివ‌, అభిమాన్యుడు అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు రూమ‌ర్‌లు న‌డిచాయి. ఈ చిత్రంలో మ‌హేష్ రా ఏజెంట్‌గా ప‌నిచేస్తాడ‌ట‌. గూఢ‌చారి మూవీస్‌లాంటి క‌థ‌నంతో న‌డుస్తుంద‌ట‌. అందుకే, ఏజెంట్ శివ అయితే బావుంటుంద‌ని మురుగ‌దాస్ అంచ‌నా వేస్తున్నాడ‌ట‌. ఇటు, మ‌హేష్ కూడా ఓకే అన్న‌ట్లు సమాచారం.

  English summary
  ahesh Babu's look in his forthcoming movie, which is being directed by AR Murugadoss, has been revealed. A couple of photos of the actor from the sets have been leaked online
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X