మహేష్ బాబు 'మహర్షి' సెట్స్‌లో విషాదం..ప్రమాదంలో లైట్ మ్యాన్ మృతి, ధర్నాకు దిగిన వర్కర్స్!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర సెట్స్ లో విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో లైట్ మ్యాన్ మృతి చెందారు.

అన్నపూర్ణ స్టూడియోస్
మహర్షి చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగుతోంది. మహర్షి కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో షూటింగ్ జరుపుతుండగా కరెంట్ షాక్ తగిలి కృష్ణ రావు అనే లైట్ మ్యాన్ మృతి చెందారు. ఎలెక్ట్రిక్ వైర్ కి సంబంధించిన పని చేస్తుండడంతో కరెంట్ షాట్ తగిలి కిందపడిపోయారు. సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా కృష్ణారావు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కేసు నమోదు
ఈ సంఘటనతో చిత్ర యూనిట్ తో పాటు కృష్ణారావు సాటి వర్కర్లంతా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం వర్కర్లంతా నిర్మాతలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. కృష్ణ రావు కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారట. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై చిత్ర యూనిట్ ఇంత వరకు స్పందించలేదు.

మహేష్ స్పందిస్తాడా
కృష్ణారావు చాలా కాలం నుంచి లైట్ మ్యాన్ గా పనిచేస్తున్నాడట. అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. మహేష్, నిర్మాతలలో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి. మరి కొద్దీ రోజులు మహర్షి చిత్ర షూటింగ్ ముగుస్తుంది అనగా ఈ విషాదం చోటు చేసుకుంది. మహర్షి చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని ఇటీవలే దిల్ రాజు మీడియాకు వివరించారు.

విడుదల ఎప్పుడంటే
దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ చిత్రంలో మహేష్ బాబు, అల్లరి నరేష్ స్నేహితులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 25న విడుదల చేయాలనీ భావించినా, ప్రచార కార్యక్రమాలకు సమయం ఉండదని మే 9కి వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











