మహర్షి ప్రీ రిలీజ్ రివ్యూ: మహేష్ కెరీర్‌లోనే మైలురాయిగా.. హిట్ ఏ రేంజ్ అంటే!

సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమాగా మహర్షి రూపుదిద్దుకొన్నది. తన నట జీవితంలో 25వ చిత్రం కావడంతో మైలురాయి చిత్రంగా ప్రొజెక్ట్ అయింది. అంతేకాకుండా సినిమా కంటెంట్ చాలా రిచ్‌గా కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ రిలీజైనప్పటి నుంచి ట్రైలర్ వరకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనేక ప్రత్యేకతలతో మే 9న రిలీజ్ అవుతున్న మహర్షి చిత్రానికి సంబంధించి బలమైన పాయింట్లు ఇవే.

వంశీ పైడిపల్లి కథ గురించి

వంశీ పైడిపల్లి కథ గురించి

మహర్షి కథ చెప్పడానికి ముందు వంశీ పైడిపల్లికి నో చెప్పుదామనే అనుకొన్నారు. కానీ 15 నిమిషాల కథ విన్న తర్వాత సినిమా స్టోరి హార్ట్ టచ్ అయింది అని మహేష్ వెల్లడించారు. అయితే రెండేళ్లు ఆగాలని చెప్పినప్పుడు థ్యాంక్సూ అనే సమాధానం వచ్చిందట. దాంతో మహేష్ ఆశ్చర్యపోయారట. వెంటనే రెండేళ్లు వెయిట్ చేస్తావా.. అంటే మీరు తప్ప మరొకరిని రిషి పాత్రలో ఊహించుకోలేని చెప్పారట.

 శ్రీమంతుడి కంటే మహర్షిలో పవర్‌ఫుల్ పాయింట్

శ్రీమంతుడి కంటే మహర్షిలో పవర్‌ఫుల్ పాయింట్

మహర్షి సినిమాలో కూడా విలేజ్‌ని దత్తత తీసుకోవడం కంటే కూడా పవర్‌ఫుల్‌ పాయింట్‌ ఉంటుంది. దాని గురించి మాట్లాడను. అది మే 9న అందరూ దాన్ని ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ సినిమాలో మూడు గెటప్స్‌ లాక్‌ చేసినప్పుడు ఆ క్యారెక్టర్‌ కూడా అందులో ఒకటి. వంశీ ఆ క్యారెక్టర్‌ పట్ల చాలా క్లియర్‌గా ఉన్నారు. స్టూడెంట్‌కి ఒక లుక్‌, కంపెనీ సిఇఓగా ఒక లుక్‌, అలాగే ఊరికి వచ్చినప్పుడు మరో లుక్‌ చాలా అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఏ లుక్‌ అయినా క్యారెక్టర్‌ ప్రకారంగా ఉంటుంది.

బలమైన కథ కావడంతో ముగ్గురు నిర్మాతలు

బలమైన కథ కావడంతో ముగ్గురు నిర్మాతలు

మహర్షి కథ బలమైన పాయింట్ కావడం, రకరకాల షేడ్స్ ఉండటం వల్ల ముగ్గురు నిర్మాతలు రంగంలోకి దిగారు. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరక్కించారు. ఈ క్రమంలో బడ్జెట్ పరిమితి దాటినా ఆందోళనకు గురికాలేదట. మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవాలన్నట్టుగా మహర్షిని తెరకెక్కించారనేది సమాచారం.

రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి భారీ సక్సెస్ తర్వాత మహర్షి వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.150 కోట్లు జరిగింది. కేవలం రూ.100 కోట్లకు ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. రూ.100 కోట్ల నికర వసూళ్లు సాధిస్తే తప్ప ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ హిట్ లభించదు.

ప్రపంచవ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్లలో

ప్రపంచవ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్లలో

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో మహర్షి సినిమా రిలీజ్ అవుతున్నది. వరల్డ్ వైడ్‌గా మహర్షి చిత్రం 2 వేల థియేటర్లకుపైగానే రిలీజ్ అవుతున్నది. ఇది నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇదో రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సినిమా కలెక్షన్లు ఓ రేంజ్‌లో ఉండటం గ్యారెంటీ అని చెప్పుకొంటున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి

దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. రొమాంటిక్ సాంగ్ రెండే ఉన్నా.. మాంటేజ్ సాంగ్స్ నాలుగు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఓ పాట సినిమాలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. జూక్ బాక్స్‌లో రిలీజ్ చేయకుండా సినిమాలోనే చూసిస్తాం అని నిర్మాతలు చెప్పారు. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా ఉందని టాక్ బయటకు వినిపిస్తున్నది.

మహర్షి ఏ రేంజ్ హిట్ అంటే

మహర్షి ఏ రేంజ్ హిట్ అంటే

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. అభిమానులు మహేష్ నుంచి ఎంత పెద్ద హిట్ కావాలనుకొంటున్నారో .. మీరే కోరుకోండి.. బ్లాక్‌బస్టర్ రేంజ్ ఎంత ఊహించుకొన్నా మీకు అది లభిస్తుంది అని అన్నారు. సినిమాపై నిర్మాతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సినిమా హిట్ అనేది గ్యారెంటీ.. కానీ ఏ రేంజ్ హిట్ అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X