‘మహర్షి’ ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే...
Recommended Video
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇండియా కంటే ముందే యూఎస్ఏ, మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుఝామునే బెనిఫిట్ షోలు వేశారు.
అన్ని ఏరియాల నుంచి 'మహర్షి' చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. మహేష్ బాబు మూడు విభిన్నమైన పాత్రల్లో అదరగొట్టాడని, వంశీ పైడిపల్లి సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం ఎమోషనల్‌గా రూపొందించినట్లు చెబుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా 'మహర్షి' కథ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ కొందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.
మహర్షిలో ఇంత డెప్త్ ఊహించలేదు
మహర్షిలో ఇంత డెప్త్ ఊహించలేదు. వంశీ పైడిపల్లి అందించిన స్టోరీ మహేష్ బాబుకు ఓవర్ షాడోలా ఉంది. వండర్ ఫుల్ మూవీ. ఒక డైరెక్టర్ కథను నమ్మి తీసిన మూవీ మహర్షి. సినిమాలోని ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అద్భుతం అనేలా ఉంది.
ఎప్పటికీ గుర్తుండి పోయే మూవీ
స్టోరీ నడిపించిన విధానం క్లాస్‌గా.. ఔట్ స్టాండింగ్ అనేలా ఉంది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఒక జన్యూన్ మూవీ అందించినందుకు వంశీ పైడిపల్లికి థాంక్స్. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేసినందుకు మహేష్ బాబుపై గౌరవం మరింత పెరిగింది.
ఫస్టాఫ్ యూత్... సెకండాఫ్ మాస్
‘మహర్షి' ఫస్టాఫ్ యూత్, క్లాస్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో ఉంది. సెకండాఫ్ మాస్ ఆడియన్స్ నచ్చడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా ఉంది. ఓవరల్‌గా ఇది ఫుల్ మీల్స్ మూవీ, బ్లాక్ బస్టర్ ఖాయం.
ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు
మహేష్ బాబు నుంచి మరొక మంచి సినిమా వచ్చింది. మహేష్ బాబు అదరగొట్టాడు. వంశీ పైడిపల్లి సినిమాలోని క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం బావుంది. అల్లరి నరేష్, పూజా హెగ్డే ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, రావు రమేష్ సూపర్బర్. డిఎస్సీ సంగీతం బావుంది.
మహేష్ అన్న చితక్కొట్టాడు
ఈ రోజు మహర్షి బ్లాక్ బస్టర్ డే. కాలేజీ ఎపిసోడ్లో ఆ టైమింగ్... విలేజ్ ఎపిసోడ్లో ఉన్నతంగా చిత్రీకరించిన విధానం అద్భుతంగా ఉంది. మహేష్ చితక్కొట్టాడు. అల్లరి నరేష్ పాత్ర చాలా బావుంది.
రిషి పాత్రలో మహేష్ బాబు రాకింగ్
‘మహర్షి' ఫస్టాఫ్ చూశాను. రిషి పాత్రలో మహేష్ బాబు అరదగొట్టాడు. కాలేజీ స్టూడెంట్ ఎపిసోడ్ చాలా బావుంది. అయితే పాటలు సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి.
నెగెటివ్ సెంటిమెంటును దాటేశాడు
‘మహర్షి' మూవీతో మహేష్ బాబు మరో హిట్టు కొట్టాడు. మే నెల నెగెటివ్ సెంటిమెంటును దాటేశాడు. ఈ సినిమా ద్వారా రైతుల సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు.
మహేష్, డీఎస్పీ సక్సెస్ కాంబినేషన్
మరోసారి మహేష్ బాబు, డీఎస్పీ కాంబినేషన్ సక్సెస్ కాంబినేషన్ అని తేలిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. మహర్షి మూవీ అద్భుతంగా ఉంది.
ఆ విషయంలో మహేష్ బాబును అప్రిషియేట్ చేస్తున్నా
తన ప్రతి మూవీలో మహేష్ బాబు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఈ విషయంలో అతడిని అప్రిషియేట్ చేస్తున్నాను. మహర్షి మూవీ చాలా బావుంది. మంచి సందేశాత్మక చిత్రం.
కొంత మంది నెగెటివ్‌గా
అయితే కొంత మంది ఈ చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి స్టోరీని ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు. ఆయనకేమైనా మైండ దొబ్బిందా అంటూ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











