మహేష్ సినిమాకి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సెంటిమెంట్.. మహర్షి కొత్త రిలీజ్ డేట్!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఇటీవల ఏప్రిల్ 25న మహర్షి చిత్రం రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించగా ఆ విడుదల తేదీ కూడా వాయిదా పడింది. తాజగా దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి కొత్త విడుదల తేదీ ఖరారు చేశారు.
వాయిదాకు కారణం
దిల్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహర్షి కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు దిల్ రాజు ప్రకటించారు. మహర్షి చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు దిల్ రాజు తెలిపారు. చిత్రాన్ని వాయిదా వేయడానికి గల కారణాలని వివరించారు. మార్చి 17కి మహర్షి చిత్ర టాకీ పార్ట్ పూర్తవుతుందని దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత సాంగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంటాయి.

హడావిడిగా ఎందుకని
మహర్షి చిత్రంలోని కొన్ని సాంగ్స్ ని అబుదాబిలో చిత్రీకరించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఏప్రిల్ లో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ముందుగా అనుకున్న ఏప్రిల్ 25లోపు షూటింగ్ పూర్తవుతుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సమయం సరిపోదు. ఇంత భారీ చిత్రానికి హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకు అని మా యూనిట్ మొత్తానికి ఆలోచన వచ్చింది. దీనితో నిన్న మహేష్ బాబుతో నేను, అశ్విని దత్ కూర్చుని చర్చించాం. ఈ చర్చల్లో భాగంగానే మే 9న మహర్షి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు దిల్ రాజు తెలిపారు.

మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ
మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని దిల్ రాజు అన్నారు. చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి మా బ్యానర్ లో మూడు చిత్రాలు చేశాడు. ఆ చిత్రాలన్నింటికంటే మహర్షి కథ అద్భుతమైనది అని తెలిపాడు. ఇక ఏప్రిల్ లో ఎలాగూ ఎన్నికల హడావిడి ఉంటుంది. అదంతా ముగిసిన తర్వాత అందరూ ప్రశాంతంగా మహర్షి సినిమా చూడొచ్చని దిల్ రాజు అన్నారు.

అశ్విని దత్ సెంటిమెంట్
ఇక మహర్షి చిత్రానికి సెంటిమెంట్ కూడా కలసి వస్తోందని దిల్ రాజు అన్నారు. అశ్విని దత్ కు మే 9 బాగా కలసివచ్చింది. జగదేకవీరుడు అతిలోక సుందరి, గత ఏడాది వచ్చిన మహానటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇక నాకు కూడా మే నెల బాగా కలసివచ్చింది. భద్ర, పరుగు, ఆర్య లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ మే నెలలోనే విడుదలైనట్లు దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











