రికార్డుస్థాయిలో మహేష్‌బాబు కటౌట్! సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్
రోజు రోజుకూ సూపర్ స్టార్ మహేష్ బాబు హవా మరింత ఎక్కువవుతోంది. మహేష్ కెరీర్‌లో 26వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' విడుదలకు ముందే మాంచి జోష్ కనబరుస్తోంది. ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తూనే జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తోంది చిత్రయూనిట్.

సుదర్శన్ 35MM థియేటర్ ముందర భారీ కటౌట్
తాజాగా మహేష్ బాబు భారీ కటౌట్ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ ముందర ఉంచడం పలువురిని అబ్బురపరుస్తోంది. ఏకంగా 81 ఫీట్ల ఎత్తుతో అత్యంత భారీగా ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలకు ఇంకా నెలకు పైగా సమయం ఉండగానే ఈ రేంజ్ కటౌట్ ఏర్పాటు చేశారంటే ఆ సినిమాకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కటౌట్ ఫోటో ట్రెండింగ్‌గా మారింది.

లక్కీ థియేటర్.. స్వయంగా మహేష్ బాబు
మహేష్ బాబుకు సుదర్శన్ 35MMను లక్కీ థియేటర్ అని చెబుతుంటారు. ఈ విషయాన్ని 'మహర్షి' సక్సెస్ టూర్‌లో మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఈ థియేటర్ లో రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఎన్నో మల్టిప్లెక్స్ థియేటర్స్ వచ్చినప్పటికీ మహేష్ బాబు కెరీర్‌లో భారీ కలెక్షన్స్ రాబట్టిన కంచుకోటగా ఈ థియేటర్ కీర్తించబడుతోంది. ప్రస్తుతం ఈ కటౌట్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర్ స్వయంగా ట్వీట్ చేసి అభిమానులకు ఆనందాన్ని పంచారు.

సరిలేరు నీకెవ్వరు అనేలా అప్‌డేట్స్
ఇక ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ అన్నీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపుతున్నాయి. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recommended Video

సరిలేరు టీజర్ హవా
ఈ క్రమంలో ఇటీవలే విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ఆన్‌లైన్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. సౌత్‌లో తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది ఈ టీజర్. ప్రస్తుతం ఈ టీజర్ యూ ట్యూబ్ ట్రెడింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











