బాక్సాఫీసును కుమ్మేసే ప్లాన్లో మహేష్ బాబు!
మెగా స్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ నెం.1 ఎవరు అనేది ఇప్పటి వరకు తేలలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురూ నెం.1 స్థానం అందుకునే వారిలో ముందు స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మగ్గురు ఏదో ఒక సందర్భంలో నెం.1 స్థానం దగ్గరి వచ్చినట్లే వచ్చి ఏదో ఒక కారణంతో అగి పోతున్నారు.
నెం.1 స్థానాన్ని అందుకోవాలంటే...మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఈ మేరకు హీరోలంతా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో తాజాగా మహేష్ బాబు కాస్త ముందున్నాడు. భవిష్యత్‌లో ఈ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రీప్లాన్డ్‌గా ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని రూపొందిస్తోంది. అదే విధంగా యూత్‌కు నచ్చే అంశాలను కూడా ఉండనున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరో వైపు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా పూర్తి యూత్‌ను, స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు త్వరలో బోయపాటి శ్రీనుతో కూడా ఓ సినిమాను ప్లాన్ చేశాడు. మాస్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే బాక్సాఫీసును కుమ్మేసి నెం.1 స్థానానికి వెళ్లాలనే ప్లాన్లో ఉన్నాడు మహేష్ బాబు.
మరో వైపు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కూడా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఏది ఏమైనా....నెం.1 స్థానాన్ని దక్కించుకుని దాన్ని కలకాల నిలబెట్టుకునేది ఎవరు? అనేది మాత్రం ఇప్పట్లో చెప్పడం కష్టమే. అయితే పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న త్రిముఖ పోటీ నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యం కాదని సినీ పండితులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











