»   » మహేష్ బాబు మదర్ ఇందిర పుట్టినరోజు వేడుక (ఫోటోస్)

మహేష్ బాబు మదర్ ఇందిర పుట్టినరోజు వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో తండ్రి కృష్ణ, సవతి తల్లి విజయనిర్మల, మహేష్ బాబు సోదరుడు, సోదరీమణులు కనిపిస్తారు...కానీ ఇందిర గారు కనిపించిన సందర్భాలు అసలు లేవనే చెప్పాలి.

చాలా కాలం తర్వాత మహేష్ బాబు తన తల్లితో కలిసి ఇటీవల వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్లో కనిపించారు. హహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కుమారుడు నిశ్చితార్థానికి మహేష్ బాబు తల్లి ఇందిర కూడా హాజరయ్యారు.

ఈ రోజు ఇందిర గారి పుట్టినరోజు. వారి నివాసంలోనే కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుక సింపుల్ గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు కూతురు ప్రియదర్శిని, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అయితే 'బ్రహ్మోత్సవం' షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు హాజరు కాలేదని తెలుస్తోంది. స్లైడ్ షోలో పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోస్..

కృష్ణ-ఇందిర

కృష్ణ-ఇందిర

తన భార్య ఇందిర పుట్టినరోజు వేడుకకు ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.

ప్రియదర్శిని

ప్రియదర్శిని

పుట్టినరోజు వేడుకలో భాగంగా తల్లికి కేక్ తినిపిస్తున్న ప్రియదర్శిని.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

ఇందిర పుట్టిన రోజు వేడుకలో కుటుంబ సభ్యులు.

మహేష్ బాబు బిజీ

మహేష్ బాబు బిజీ

సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఈ వేడుకలో పాల్గొనలేక పోయారు.

English summary
Superstar Mahesh's Mother Smt. Indira Devi's Birthday Celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu