»   » హీరోగా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేనల్లుడు: దర్శకుడు ఎవరంటే...?

హీరోగా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేనల్లుడు: దర్శకుడు ఎవరంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu's Nephew To Debut Under Dil Raju's Banner

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. మహేష్ బాబు మేనల్లుడు, తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ గల్లా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బేనర్లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. మే నెలలో ఈ చిత్రం లాంచ్ కాబోతోందట.

Mahesh Babus nephew Ashok Galla make his acting debut

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా చేసిన కృష్ణారెడ్డి ఇంతకు ముందు 'ఆడు మగాడ్రా బుజ్జి' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధీర్ బాబు మీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

Mahesh Babus nephew Ashok Galla make his acting debut

మహేష్ బాబు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో, దిల్ రాజు లాంటి బడా నిర్మాత కావడంతో ఒక పెద్ద డైరెక్టర్ ద్వారానో? లేక మంచి ఫాంలో ఉన్న దర్శకుడితోనో అశోక్ లాంచింగ్ ఉంటుందని మహేష్ అభిమానులు భావించడం సహజం, అయితే కృష్ణారెడ్డి పేరు వినిపించడంతో కొందరు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి మరో రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఈ స్క్రిప్టు వాస్తవానికి వేరే దర్శకుడు సిద్ధం చేశాడని, పలు కారణాల వల్ల అతడి స్థానంలో కృష్ణారెడ్డిని రీప్లేస్ చేశారని, సుధీర్ బాబు ఇతడిని ఈ సినిమాకు రికమండ్ చేశాడని టాక్.

English summary
Mahesh Babu's nephew, Ashok Gallawill soon make his acting debut. Dil Raju will launch the youngster.Krishna Reddy, who made his directorial debut with Sudheer Babu-starrer "Aadu Magaadra Bujji", the only film that he has directed so far, has been assigned with the responsibility of launching Ashok Galla as hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X