మహేష్ బాబు సెన్సేషనల్ రికార్డ్.. ఒక్కడే ఒక్కడు.. సరిలేరు నీకెవ్వరు
సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ దుమ్ముదులిపేసింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. దేశవిదేశాల్లో మహేష్ హంగామా కనిపించింది. ఈ నేపథ్యంలో గతంలో ఏ హీరోకు దక్కని సరికొత్త ఫీట్ సాధించారు మహేష్ బాబు. ఈ మేరకు ఆయన పేరిట న్యూ రికార్డు నెలకొల్పబడింది.
'సరిలేరు నీకెవ్వరు' మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ నంబర్స్ నమోదు చేస్తూ కొన్నిచోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ తన పేరిట లిఖించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ బాక్సాఫీస్‌పై 'సరిలేరు నీకెవ్వరు' దాడి కనిపించింది. బాక్సాఫీస్ బద్దలయ్యేలా మొదటిరోజే 1 మిలియన్ డాలర్ (ప్రీమియర్స్‌తో కలిపి) కలెక్షన్స్ రాబట్టాడు మన సూపర్ స్టార్.

ఓ అరుదైన ఫీట్ సొంతం చేసుకొని 'సరిలేరు నీకెవ్వరు' అని అందరి చేత అనిపించుకుంటున్నాడు మహేష్. ఈ సినిమా ద్వారా 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్. సౌత్ ఇండియా లోనే ఇప్పటిదాకా ఇలా పది సార్లు 1 మిలియన్ సాధించిన హీరోలు లేరు. ఆ ఫీట్ మహేష్ మాత్రమే చేరుకోగలిగాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ అమితాబ్ విజయశాంతి కీలక రోల్ పోషించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











