న్యూ ఇయర్ వెకేషన్: ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ (ఫోటోలు)
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ప్రతి ఏడాది న్యూ ఇయర్ విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. ఈ సారి తమ వెకేషన్‌కు గల్ఫ్ కంట్రీలను ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఒమన్ దేశంల
ప్రస్తుతం మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ... వారి స్నేహితులతో కలిసి ఒమన్ దేశంలో గడుపుతున్నారు. సాధారణంగా వెకేషన్ ఫోట్లో కనిపించడానికి మహేష్ బాబు ఇష్టపడరు. అయితే ఓ సెల్ఫీ పిక్‌లో ఆయన తన ఫ్రెడ్స్‌తో కలిపి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

షూటింగుకు గ్యాప్
ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అను నేను షూటింగుతో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తోరకెక్కుతున్న చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే క్రిస్మస్, న్యూఇయర్ కోసం షూటింగుకు బ్రేక్ ఇచ్చినట్లు తెలెస్తోంది.

మహేష్ బాబు ఫ్యామిలీ మెన్
మహేష్ బాబు పూర్తిగా ఫ్యామిలీ మెన్. ఎప్పుడూ షూటింగుల్లో బిజీగా ఉండే ఆయన మిగతా సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తారు.

విదేశాల్లోనే ఎంజాయ్మెంట్
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ సాధారణ జనం మధ్యకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి విదేశీ ట్రిప్పులకే ప్రాధాన్యం ఇస్తారు మహేష్ బాబు.

నమ్రత ప్లానింగ్ అదుర్స్
మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు షూటింగుల్లో బిజీగా ఉంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో నమ్రతదే ఆధిపత్యం. మహేష్ బాబుకు ఏ సమస్యా రాకుండా అన్ని పక్కాగా ప్లాన్ చేస్తూఅదుర్స్ అనిపించుకుంటోంది నమ్రత.


Click it and Unblock the Notifications











