twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగాడు’ కాదు, మహేష్-కొరటాల శివ ఇక రెగ్యులర్..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ‘మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9 నుండి హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేసారు. అదే విధంగా ఈ చిత్రానికి ‘మగాడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలను నిర్మాతలు ఖండించారు.

    Mahesh Babu's next to roll from Oct 9

    టైటిల్ ఇంకా నిర్ణయించలేదు...
    నిర్మాతలు ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ మాట్లాడుతూ...‘మా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో సూపర్ స్టార్ మహేష్ గారితో చేస్తున్న తొలి చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇంత వరకు ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ నిర్ణయించిన తర్వాత అపీషియల్ గా మేమే ఎనౌన్స్ చేస్తాము. మా బేనర్లో తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా ఈ చిత్రం ఉంటుంది' అన్నారు.

    సూపర్ స్టార్ మహేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్, సుబ్బరాజు, తులసి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధి, స్టిల్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, మేకప్: పట్టాబి, కాస్ట్యూమ్స్: రాజు, స్టిల్స్: దాసు, చీఫ్ కో-డైరెక్టర్: పి.వి.వి.సోమరాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వి.వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొడక్షన్ మేనేజర్ బి.వి.రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్ రాజు.ఎం.చంద్రశేఖర్ రావిపాటి. నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశకర్, సి.వి.మోహన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    The shooting of Mahesh Babu's upcoming film to be directed by Koratala Siva to roll from Oct 9.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X