మహేష్ బాబు ‘బావిలో కప్ప’!?
చిరంజీవి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో నెం.1 స్థానం దక్కించుకునేది ఎవరు? అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో దూకుడుగా వచ్చి దాదాపుగా నెం.1 పొజిషన్ కు చేరువయ్యాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఇప్పటికే ఒకసారి పోకిరి సినిమా ద్వారా టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన మహష్ మరోసారి తన దూకుడు సినిమా ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పే దిశగా సాగుతున్నాడు. ఈ పరిణామాలతో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎంత హాపీ ఉన్నా వాళ్లని ఓ వెలితి వెంటాడుతూనే ఉంది. తెలుగులో దుమ్మురేపుతున్న మహేష్ బాబు బాలీవుడ్ లో ట్రై చేస్తే తప్పేంటనేది వారి ఆలోచన. బాలీవుడ్‌లోనూ రానించగల గ్లామర్, టాలెంట్ తమ హీరోకు ఉందనేది వారి నమ్మకం. ఇదే విషయాన్ని వారు పలు సార్లు మహేష్ దృష్టికి తీసుకెళ్లారు కూడా..
అయితే మహేష్ బాబు మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేసే మూడ్ లేదంటున్నాడు. మనకు టాలీవుడ్ చాలు, బాలీవుడ్ లో అడుగుపెట్టి అనవసర టెన్షన్లు తలకెక్కించుకోవడం ఎందుకనేది మహేష్ బాబు ఆలోచనట. అయితే దీనిపై మహేష్ అభిమానులు మాత్రం సంతృప్తిగా లేరు. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాకు దర్శకత్వం వహించి పూరి బాలీవుడ్ లో గట్టిగా పాతుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. దూకుడు ద్వారా దర్శకుడు శ్రీను వైట్ల కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
మహేష్ బాబు సినిమా ద్వారా లాభ పడిన వీరు బాలీవుడ్ లో అడుగు పెట్టి తమ భవిష్యత్ కు బంగారు బాట వేసుకుంటుంటే మహేష్ బాబు మాత్రం బావిలో కప్పలా...టాలీవుడ్ కే పరిమితం కావడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. మరి మహష్ తన అభిమానుల కోరికను ఎప్పుడు తీరుస్తాడో? ఏమో..కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











