రాత్రి హ్యాంగ్‌ఓవర్ ఇంకా దిగలేదు.. మహేష్ ట్వీట్.. అసలేం జరిగిందంటే!

Recommended Video

Mahesh Babu Can't Get Over The Ultimate Hangover || Filmibeat Telugu

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో క్రీడాభిమానుల్లో ఉత్కంఠను నిలిపింది ఈ మ్యాచ్. సాధారణంగా మ్యాచ్‌ టై కావడమే అరుదు.. అలాంటిది సూపర్ ఓవర్ కూడా టై కావడం.. ఆపై ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే తాజాగా ఈ మ్యాచ్ ఫలితంపై స్టార్ హీరో మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి పోతే..

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు పెట్టారు. అది కూడా టై కావడంతో ఇంగ్లాండ్ జట్టు విజేతగా ప్రకటించబడింది.

బౌండరీల ఆధారంగా.. ఫ్యాన్స్ నిరాశ

బౌండరీల ఆధారంగా.. ఫ్యాన్స్ నిరాశ

రెండు జట్లు సాధించిన బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులు. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. ఈ నిబంధనపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు అందరు కూడా ఈ వరల్డ్ కప్‌ ఫైనల్లో ఓడినట్లుగా ప్రకటించబడిన న్యూజిలాండ్ ఆట తీరును పొగుడుతున్నారు.

మహేష్ బాబు కామెంట్.. హ్యాంగ్‌ఓవర్ లోనే ఉన్నానంటూ!

తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ విషయమై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. ''ఇప్పటికీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు.. కానీ న్యూజిలాండ్ మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు'' అని పేర్కొన్నాడు మహేష్. ఆయన చేసిన ఈ ట్వీట్ పట్ల సినీ, క్రీడాభిమానులంతా సానుకూలంగా రియాక్ట్ అవుతున్నారు.

 మహేష్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. మహేష్ 26వ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X