సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్.. మహేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. ఏ ఏరియాలో చూసినా!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎంత ఉందో మరోసారి రుజువైంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నారు ఈ స్టార్ హీరో. ఆయన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. దేశవిదేశాల్లో ఎక్కడ చూసినా ఒకే డిమాండ్ కనిపించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

'సరిలేరు నీకెవ్వరు' హైప్.. ఆ ఎఫెక్ట్‌తో

'సరిలేరు నీకెవ్వరు' హైప్.. ఆ ఎఫెక్ట్‌తో

'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ ప్రారంభం నుంచే ఆ సినిమా అప్‌డేట్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ చేశారు. ఎప్పటికప్పుడు మహేష్ ఫ్రెష్ లుక్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో ఈ సంక్రాంతికి మహేష్ హంగామా ఫుల్లుగా ఉంటుందని ఫిక్సయ్యారంతా. ఈ ఎఫెక్ట్‌తో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.

సెంచరీ కొట్టేసిన మహేష్.. నిజంగా సరిలేరు ఎవ్వరూ అనిపిస్తూ

సెంచరీ కొట్టేసిన మహేష్.. నిజంగా సరిలేరు ఎవ్వరూ అనిపిస్తూ

అన్ని ఏరియాల్లో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు సేల్ అయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా చూస్తే.. నిజంగా సరిలేరు ఎవ్వరూ అనిపిస్తూ 101. 05 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలు.. ఏ ఏరియాలో ఎంతెంత

రెండు తెలుగు రాష్ట్రాలు.. ఏ ఏరియాలో ఎంతెంత

నైజాంలో 26 కోట్లు, సీడెడ్ 12 కోట్లు, ఉత్తరాంధ్ర 10 కోట్లు, ఈస్ట్ గోదావరి 7.5 కోట్లు, వెస్ట్ గోదావరి 6 కోట్లు, గుంటూరు 7.3 కోట్లు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3.1 కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 77.9 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇతర రాష్ట్రాలు.. ఓవర్సీస్

ఇతర రాష్ట్రాలు.. ఓవర్సీస్

ఇక ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ డిమాండ్ ఎక్కువగా కనిపించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 9.65 కోట్లు, అదేవిధంగా ఓవర్సీస్‌లో 13.5 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్ చూస్తే 101. 05 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఐటెం సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X