మహేష్ బాబు- రష్మిక స్టార్ట్ చేయబోతున్నారు.. డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న మహేష్ బాబు.. ఇటీవలే 'మహర్షి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో 25 వ సినిమాగా వచ్చి భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమాగా నిలిచింది. దీంతో మహేష్ 26 వ సినిమాపై అందరి దృష్టి పడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మహేష్, తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్న కారణంగా అటెండ్ కాలేకపోయారు. చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరు' అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? మహేష్ బాబు మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వెళతాడా? అని ఆసక్తిగా చూసిన ఆయన అభిమానుల కోసం ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజాగా అందిన సమాచారం మేరకు జులై 2 వ తేదీ నుంచి 'సరిలేరు నీకెవ్వరు' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుందని, ఇందులో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా భాగం కానుందని ఫిలింనగర్ టాక్.

 Mahesh Babus SariLeru Neekevvaru Regular shoot starts from..

'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి దిల్ రాజు, అనిల్ సుంకరలతో పాటు మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అలాగే ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్‌గా పేరు గాంచిన విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికర అంశం. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడట. చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది.

ఇటీవలే ఎఫ్ 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అలాగే 'మహర్షి' సక్సెస్ తో మంచి జోరు మీదున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X