సూపర్‌స్టార్‌ మహేష్‌ ముహుర్తం పెట్టేశాడు.. ‘సరిలేరు నీకెవ్వరు’టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.

మహర్షి తర్వాత మహేష్ బాబు.. F2 అనంతరం రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు.

 Mahesh Babus Sarileru Neekevvaru Will Be Out On November 22nd

అయితే ఇప్పటికే టైటిల్ ఫస్ట్‌లుక్ క్రేజ్‌ను తీసుకురాగా, స్వాతంత్ర్యపు దినోత్సవం రోజున ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ కావడం అభిమానుల్లో మంచి జోష్ నింపింది. కాగా ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టీజర్ రిలీజ్ ప్రకటన రానే వచ్చింది. ఈ చిత్రం టీజర్‌ను 22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X