తెలంగాణ పై కలత చెంది చెన్నైకి చెక్కేసిన ప్రిన్స్ మహేష్ ..!

By Sindhu

అవును... నిజమే!! ప్రిన్స్ మహేష్ బాబు తన షూటింగ్‌ను చెన్నైకి మార్చుకున్నాడు. కానీ తన మకాన్ని మాత్రం మార్చడం లేదు. తన కొత్త చిత్రం కిలాడి(పేరు అధికారికంగా ప్రకటించలేదు) షూటింగ్‌ను గతనెల 24న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ మండలం గిరిగిట్‌పల్లి శివారులో వేసిన భారీ సెట్టింగ్‌ను తెలంగాణావాదులు ధ్వంసం చేసిన సంగతి విదితమే. అందుకే తిరిగి అదే సెట్ ను చెన్నైకు శివార్లలో పునర్ నిర్మిస్తున్నారు.

అంతకుముందు హైదరాబాద్‌లో రాజస్థాన్ తరహా కల్చర్‌తో కొన్ని వందల సంఖ్యలో ప్రజలు అక్కడ నివశించేటట్లుగా వేసిన ఆ సెట్‌కోసం వందలాదిమంది పడిన శ్రమ అంతా వృధా అయింది. దాదాపు కోటీ 70 లక్షల రూపాయల వరకూ దానికి ఖర్చయింది. ఎంతోమంది శ్రామికుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది. అందుకే నిర్మాతలు చెన్నైలో సెట్ వేస్తున్నారు. త్వరలో మహేష్ బాబు అక్కడ షూటింగ్‌లో పాల్గొననున్నారు. అక్కడికే కొద్ది రోజులు మకాం కూడా మార్చనున్నట్లు సమాచారం. ఆది నుంచీ సినిమా ఆలస్యంగా జరుగుతుండటంతోపాటు ఇటువంటి గొడవలతో మరింత జాప్యం జరిగింది.

ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీకనకరత్నమూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ కేరళలో జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఖలేజా' అనేపేరు పరిశీనలో ఉన్నట్లు సమాచారం. సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు.మరి వేసవిలో మహేష్ సినిమా ఆంధ్ర- తెలంగాణాలో ఎటువంటి క్రేజ్‌ను సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X