లండన్లో మహేష్ తనయుడు గౌతంపై సీన్ల చిత్రీకరణ
హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ ప్రెస్ మీట్లో స్పష్టం చేసాడు.
తాజాగా గౌతం కృష్ణపై లండన్లో పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో గౌతం కృష్ణ...సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన సీన్లు ఆదివారం చిత్రీకరిచారు. మహేష్ బాబు తనయుడు తెరంగ్రేటం చేసే సినిమా కావడంతో '1' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. స
గతంలో మహేష్ బాబు కూడా తన తండ్రి కృష్ణ నటించిన 'నీడ' చిత్రం ద్వారా 1979లో బాల నటుడిగా తెరంగ్రేటం చేయడంతో పాటు, పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు గౌతం కూడా మహేష్ బాబు తరహాలోనే వెండితెరకు పరిచయం కాబోతుండటం విశేషం.

ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

2005లో మహేష్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు. 2006 ఆగస్టు 31న గౌతం జన్మించాడు. 2012 జులై 20న కూతురు సితార జన్మించింది.

మహేష్ బాబు వరసుడుగా గౌతం కృష్ణ వెండి తెర తెరంగ్రేటం చేయబోతున్నారు.

మహేష్ బాబును మించిన గ్లామర్
మహేష్ బాబు తనయుడు గౌతం మహేష్ బాబు పోలికలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో వేడుకకు గౌతం కృష్ణ హాజరయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి ఉన్న గౌతం చిత్రాలు ఇక్కడ చూడొచ్చు.

తనయుడంటే మహేష్ బాబుకు అమితమైన ప్రేమ. అతన్ని ఇప్పటి నుండే ఫ్యూచర్ సినీ హీరోగా తీర్చి దిద్దుతున్నారు.


Click it and Unblock the Notifications











