స్పైడర్: మహేష్ బాబు స్టైల్ అదుర్స్... (న్యూ పోస్టర్స్)
స్పైడర్ మూవీ ప్రమోషన్లు స్పీడందుకున్నాయి. ఇందులో భాగంగా న్యూ పోస్టర్లు విడుదలయ్యాయి.
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'స్పైడర్'. మరో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్' సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.
దీంతో పాటు మహేష్ బాబు స్టైలిష్ లుక్స్‌తో కూడిన పోస్టర్లు రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ ఈ చిత్రంలో గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్‌గా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని ఈ పోస్టర్లు చూస్తే స్పష్టం అవుతోంది.

ఫ్యాన్స్ నుండి రెస్పాన్స్ అదుర్స్
‘స్పైడర్' న్యూ పోస్టర్లకు అభిమానుల నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది. మహేష్ బాబు ఫ్యాన్ పేజీల్లో స్పైడర్ న్యూ పోస్టర్లు వైరల్ అయ్యాయి. బాబు కోరీర్లో ఈ చిత్రం మరో భారీ హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.

స్పైడర్
'స్పైడర్' సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ మీద ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రొమేనియాలో ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విజయదశమి సందర్భంగా 'స్పైడర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

భారీ బడ్జెట్
130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాన తారాగణం
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.


Click it and Unblock the Notifications











