twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైడర్ ఎందుకు చూడాలంటే.. కారణాలు ఇవే.. కాసేపట్లోనే అమెరికాలో బొమ్మ..

    ఈ ఏడాది రిలీజ్ అయినా, అవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పైడర్ ఒకటి. ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

    By Rajababu
    |

    ఈ ఏడాది రిలీజ్ అయినా, అవుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పైడర్ ఒకటి. ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. అత్యంత సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, అరబిక్‌ భాషల్లో రూపొందింది. సినిమాను అభిమానించే ప్రేక్షకులు స్పైడర్ ఎందుకు చూడాలంటే..

    దుష్టులకు సింహస్వప్పంగా..

    దుష్టులకు సింహస్వప్పంగా..

    స్పైడర్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబు స్లయిల్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నది. దుష్టులకు సింహస్వప్నంగా నిలిచే ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా మహేశ్ నటిస్తున్నాడు. అధికారిగా మహేశ్ ధరించిన ఫార్మల్ డ్రెస్సెస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు మహేశ్ చాలా అందంగా కనిపించిన చిత్రాల్లో స్పైడర్ ఒకటి.

    Recommended Video

    Planning to Release Another Song From Mahesh Babu "SPYDER"
    వరుస హిట్లతో జోష్

    వరుస హిట్లతో జోష్

    గజనీ, టాగూర్, తుపాకీ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన మురుగదాస్.. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ హిట్లతో జోష్ మీద ఉన్న ప్రిన్స్ మహేశ్ బాబు జతకట్టడం క్రేజీ కాంబినేషన్‌గా మారింది. తుపాకీ సమయంలో కలువాల్సిన ఈ జోడికి ఇప్పుడు సమయం కుదిరింది. ఈ కాంబినేషన్ రూపొందిన చిత్రం మహేశ్ కెరీర్‌లోనే హై యాక్షన్ చిత్రంగా నిలిచిపోనున్నది.

    తొలిసారి తమిళంలోకి

    తొలిసారి తమిళంలోకి

    ప్రిన్స్ మహేశ్ తొలిసారి హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నటించారు. తొలిసారి తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. దాంతో స్పైడర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మహేశ్ స్పైడర్‌తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

    యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్..

    యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్..

    స్పైడర్ విషయానికి వస్తే మహేశ్, ఎస్‌జే సూర్య మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆడియో, చిత్ర ప్రమోషన్‌లో దర్శక, హీరోలు గట్టిగా చెబుతున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ల మధ్య కథ.. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా ఉంటుందని చెబుతున్నారు. కనిపించని శత్రువుతో హీరో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ తరహా సన్నివేశాలు ఆడియెన్స్‌ను థ్రిల్ గురిచేస్తాయి అని మురుగదాస్ చెప్పడం విశేషం. ఈ చిత్రం తుపాకి 2.0 అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    125 కోట్ల బడ్జెట్

    125 కోట్ల బడ్జెట్

    స్పైడర్ బడ్జెట్ వింటేనే సెన్సేషనల్ అనిపిస్తున్నది. మహేశ్ కెరీర్‌లోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా రూ.125 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ హై ఫై చిత్రాన్ని పూర్తి చేయడానికి డైరెక్టర్ మురుగదాస్ 2 ఏళ్లు గ్యాప్ తీసుకోవడం చిత్ర క్వాలిటీకి అద్దం పట్టిందనే మాట వినిపిస్తున్నది.

    మహేశ్, రకుల్ కెమిస్ట్రీ

    మహేశ్, రకుల్ కెమిస్ట్రీ

    ఇక ప్రిన్స్ మహేశ్, రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. హ్యారీస్ జైరాజ్ అందించిన సంగీతం, పాటల చిత్రీకరణ తెరపై సందడి చేయడం ఖాయమంటున్నారు.

    కాసేపట్లో సినిమా..

    కాసేపట్లో సినిమా..

    స్పైడర్ చిత్రం అమెరికాలో 250కు పైగా స్క్రీన్లలో రీలీజ్ చేస్తున్నారు. దంగల్, బాహుబలి తర్వాత ఇదే అత్యధిక స్క్రీన్లు. ఈ చిత్రం తెలుగు, తమిళ రాష్ట్రాల కంటే ముందుగానే అమెరికాలో మంగళవారం (26ర) రిలీజ్ అవ్వడం గమనార్హం.

    English summary
    Only two days away from one of the biggest releases of 2017 SPYDER starring Mahesh Babu, Rakul Preet Singh and SJ Suryah and directed by AR Murugadoss. It’s one of the biggest action films of this year. After stylish first look posters, an intriguing teaser and an action packed trailer, fans are now eager for the release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X