twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు' సైకిల్ ని సొంతం చేసుకోవాలంటే...

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మహేష్‌ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు' . మార్నింగ్ షో నుంచే చిత్రం సూపర్ హిట్ టాక్ ని మోసుకుని వచ్చి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ ని అదరకొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి తలుచుకోగానే మరో విషయం గుర్తుకు వస్తుంది. అది ఈ చిత్రంలో మహేష్ ఉపయోగించిన సైకిల్. 350,000 విలువ చేసే Cannondale Scalpel Carbon 3 cycle . ఈ సైకిల్ ని మీరు పొందాలంటే ఓ సింపుల్ మార్గం ఉంది.

    అది మరేదో కాదు... మొదట www.iamsrimanthudu.com సైట్ లోకి వెళ్లండి. తర్వాత అక్కడ 999 డొనేట్ చేసి బిడ్ లో పాల్గొనండి. విరాళం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ఒక కూపన్ ఇస్తారు. ఆ తర్వాత డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. బంపర్ డ్రా విన్నర్ కు మహేష్ బాబు తన చేతుల మీదుగా ఈ సైకిల్ ని అందచేస్తారు. అయితే ఈ విరాళం ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు.

    'శ్రీమంతుడు' మేకింగ్ : కొత్త వీడియో ఇక్కడ చూడండి..

    మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు' చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై నవీన్ ఎర్నేని రూపొందింది.

    దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, అన్ని చోట్లా సినిమా పెద్ద హిట్ అయిందని, మొదటిరోజునుండి అన్ని వర్గాల ప్రేక్షకుల వౌత్‌టాక్‌తోనే అనుకున్నదానికన్నా హిట్ అయిందని తెలిపారు. ఇటువంటి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్న హీరో కష్టమంతా ఈ చిత్రంలో కన్పిస్తుందని, చిత్ర విజయం గూర్చి విన్న తరువాత తాము పడ్డ కష్టం మర్చిపోయామని ఆయన అన్నారు.

    ప్రేక్షకులనుండి తమ సంస్థ నిర్మించిన తొలి చిత్రానికి మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, అన్ని కేంద్రాల్లో మంచి రిపోర్టులు వచ్చాయయని, భారతదేశంలోనే కాక యుఎస్‌ఎ, ఓవర్‌సీస్‌లో విజయఢంకా మ్రోగిస్తోందని ఆయన తెలిపారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Mahesh Babu's Srimanthudu Cycle Up For Grabs

    మరో ప్రక్క ఈ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని, జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైందంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

    మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.

    దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,

    కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Srimanthudu cycle that attained a great craze with the first look posters of the film, here's your chance to take it home. The cycle superstar Mahesh Babu used Srimanthudu, might now be your if you have liked it. In the film, Mahesh used a Cannondale Scalpel Carbon 3 cycle, worth almost Rs.350,000. Those interested can bid for the cycle at www.iamsrimanthudu.com by donating Rs.999, the film's makers said in a statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X