అఫిషియల్.. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’(ఫస్ట్ లుక్)

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ లుక్ విడుదల చేసారు.

ఇంతకాలం ఈ చిత్రాన్ని అభిమానులు ‘శ్రీమంతుడు' అంటూ పిలుస్తూ వచ్చారు. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పటి వరకు సినిమా టైటిల్ ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని కొరటాల శివ ఇప్పటి వరకు ‘మహేష్ 21' అంటూ పిలుస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఫస్ట్ లుక్, టైటిల్ అఫీషియల్ కావడంపై అభిమానులు ఆనందంగా ఉన్నారు.

Mahesh Babu’s Srimanthudu First Look

ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X