»   » మహేష్ రియలెస్టేట్ : ఇంకాస్త "యాడ్" చేసాడు

మహేష్ రియలెస్టేట్ : ఇంకాస్త "యాడ్" చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలతో కంటే ప్రకటనలతోనే ఎక్కువ సంపాదించవచ్చని.. పాపులారిటీ కూడా సంపాదించవచ్చని బాలీవుడ్ హీరోలు తెలుసుకున్నంత తోందరగా మనోళ్ళు తెలుసుకోలేక పోయారు. అక్కడ అంతాబ్, షారూఖ్ లాంతి పెద్ద హీరోలు కూడా యాడ్స్ లో నటిస్తూంటే..

"అబ్బ...! ఎంత కక్కుర్తి" అన్నట్టు చూసేవాళ్ళు. కానీ అసలు వ్యాపార సూత్రం మనోళ్ళకి అర్థం కావటానికి చాలాకాలమే పట్టింది. థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేశాక మిగతా వాళ్లకూ యాడ్స్ రుచి తెలిసింది.సంపాదన లో సులువు అర్థమైంది.

ఐతే మన దగ్గర కేవలం యాడ్స్ తోనే ఆగిపోకుండా.., బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగటం అనే దాకా ట్రెండ్ ని లాకొచ్చింది మాత్రం మహేష్ బాబే. ప్రస్తుతం తెలుగులో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్న యాడ్స్ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తున్న హీరో కూడా మహేష్ బాబే. ఇప్పటికిప్పుడు థమ్సప్, ఐడియా లతో సహా దాదాపు పది బ్రాండ్ల దాకా మహేష్ బాబు చేతిలో ఉన్నాయి.

 Mahesh Babu's Trendy look in New Commerical

ఈ మధ్యే మొదటిసారిగా మహేష్ బాబు ఓ లోకల్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రచారకర్తగా నియమితుడయ్యాడు. ఆ సంస్థ పేరు.. రామకృష్ణ వెనుజియా. ఈ కంపెనీ కోసం మహేష్ ఇప్పటికే ఓ యాడ్ కూడా చేశాడు. చాలా రిచ్‌గా తెరకెక్కిన ఆ యాడ్‌లో మహేష్ పక్కా ఫ్రొఫెషనల్ మోడల్ లా ప్రచారం చేసాడు.

ఇంటర్నేషనల్న్ స్టాండెర్డ్స్ తో మల్టీనేషనల్ కంపెనీల ఆడ్ రేజ్ లో ఈ యాడ్ రూపొందించారు. రామకృష్ణ వెనుజియా అనేది విజయవాడ బేస్డ్‌గా నడుస్తున్న సంస్థ. మహేష్ బాబు హ్యాండ్ పడటంతో తమ సంస్థకు మంచి ప్రచారం లభిస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. ఒక్కో యాడ్‌కు కోట్లల్లో పారితోషకం తీసుకుంటున్న మహేష్.. సినిమాల కంటే చాలా ఎక్కువ మొత్తమే ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నాడు.

English summary
Mahesh Babu New Commercial for Ramakrishna Venuzia Ad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu