మేడమ్ టుస్సాడ్స్: మహేష్ బాబు విగ్రహం రెడీ అవుతోంది.... (ఫోటోస్ వైరల్)

By Bojja Kumar

Recommended Video

Mahesh Babu's Wax statue Getting Ready

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో త్వరలో కొలువుదీరబోతున్న సంగతి తెలిసిందే. పలువురు కళాకారులు ఆయన విగ్రహం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు తలభాగానికి సంబంధించిన పార్ట్ తయారైంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విగ్రహాన్ని ఎలా తయారు చేస్తున్నారు అనేది ఈ ఫోటోలో చూడొచ్చు.

రూపుదిద్దుకుంటున్న మహేష్ విగ్రహం

రూపుదిద్దుకుంటున్న మహేష్ విగ్రహం

తల భాగం వరకు తయారైన విగ్రహాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు. త్వరలోనే మహేష్ బాబు పూర్తి విగ్రహం సిద్ధం కాబోతోంది. ఇవాన్ రీస్ అనే ఆర్టిస్ట్ ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.

ఇప్పటికే కొలతలు తీసుకెళ్లిన మ్యూజియం ప్రతినిధులు

ఇప్పటికే కొలతలు తీసుకెళ్లిన మ్యూజియం ప్రతినిధులు

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు ఏప్రిల్ మాసంలో మహేష్ బాబు ఇంటికి వచ్చి ఆయనకు సంబంధించిన కొలతలు తీసుకెళ్లారు.

సంతోషం వ్యక్తం చేసిన సూపర్ స్టార్

సంతోషం వ్యక్తం చేసిన సూపర్ స్టార్

ఈ విషయం గురించి తెలియజేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేసాడు. మేడం టుస్సాడ్ మ్యూజియంలో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని మహేష్ బాబు తెలిపాడు. మైనపు విగ్రహం నెలకొల్పడానికి వివరాలు సేకరించిన మేడం టుస్సాడ్ కళాకారులకు మహేష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

 షూటింగులో బిజీ బిజీ

షూటింగులో బిజీ బిజీ

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి మూవీ షూటింగులో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా ఇది. ఇప్పటి వరకు వచ్చిన మహేష్ బాబు సినిమాల్లో ది బెస్ట్ అనిపించే కథతో ఈ మూవీ రాబోతోందని తెలుస్తోంది. టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X