»   » నమ్రత పర్యటన: బుర్రిపాలంలో మహేష్ ఫ్యాన్స్ హడావుడి (ఫోటోస్)

నమ్రత పర్యటన: బుర్రిపాలంలో మహేష్ ఫ్యాన్స్ హడావుడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామ అభివృద్ధికి మహేష్ బాబు సిద్ధమయ్యారు. మహేష్‌ సూచనలతో ఆయన భార్య నమ్రత, సోదరి పద్మ గురువారం బుర్రిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు.

గ్రామంలో పర్యటించిన అనంతరం నమ్రత, పద్మ.... కృష్ణ నిర్మించిన గీతామందిరంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని స్కూల్‌ను పరిశీలించారు. దత్తత గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థులు, అధికారులతో మహేష్‌ కుటుంబసభ్యలు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు, గ్రామస్తులు కలిసి అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నమ్రత మాట్లాడారు. తెలుగు సరిగా మాట్లాడటం రాని నమ్రత ఇంగ్లీషులో మాట్లాడగా, అక్కడి ఓ వ్యక్తి దానిని తెలుగులోకి అనువదించారు.

మరోమారు మహేష్ బాబుతో కలిసి గ్రామానికి వస్తానని నమ్రత ప్రకటించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. వీరి రాక సందర్బంగా అభిమానులు బుర్రిపాలెంలో భారీగా బేనర్లు, స్వగత తోరణాలు ఏర్పాటు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఫ్యాన్స్

ఫ్యాన్స్


నమ్రత, గౌతం బుర్రిపాలెం వస్తున్నారనే విషయం తెలుసుకుని... వారు వచ్చే దారిలో అభిమానులు బేనర్లు ఏర్పాటు చేసారు.

బుర్రిపాలెం

బుర్రిపాలెం


నమ్రత, గౌతంలను చూసేందుకు అభిమానులు భారీగా బుర్రిపాలెం చేరుకున్నారు.

కమిటీలు


గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు నమ్రత తెలిపారు.

మహేష్ బాబుతో...


మరోమారు మహేష్ బాబుతో కలిసి గ్రామానికి వస్తానని నమ్రత ప్రకటించారు.

English summary
Tollywood Actor Mahesh Babu's wife Namratha Sirodhkar and his sister Galla Padmavathi visited the adopted village Burripalem at Tenali in Guntur district. Namratha and Padmavathi met the local officials and villagers of the Burripalem and collected the review report of development of the village. Villagers expressed happiness seeing them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu