'ఆగడు' : ప్రపంచంలోనే పెద్ద పోలీస్ బెల్ట్ (ఫొటో)

By Srikanya

హైదరాబాద్‌: ఈనెల 19న 'ఆగడు' చిత్రం విడుదల పురస్కరించుకుని షోటైమ్‌ అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆగడు చిత్రంలో మహేష్‌బాబు ధరించిన పోలీస్‌ బెల్ట్‌ను భారీ పరిమాణంలో తయారు చేసి మహేష్‌ అభిమానుల చేత ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే రైల్లో బెల్ట్‌ను తీసుకెళ్లనున్న నిర్వాహకులు విశాఖ ఆర్కే బీచ్ లో అభిమానుల చేత ఆవిష్కరింపజేయనున్నారు. ఈ బెల్ట్ 4000 మీటర్లు ఉండబోతోందని తెలుస్తోంది.

మహేష్‌బాబు నటించిన 'ఆగడు' ప్రమోషన్ చూస్తున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా డిజైన్ చేసింది మరెవరతో కాదు. ..సంజీవ్ కుమార్. ఈ చిత్ర ప్రచారం సంజీవ్‌కుమార్‌ దర్శకత్వ పర్యవేక్షణలో జరగుతోంది. ఈయన ఈటీవీలో ప్రసారమవుతోన్న రెడీ, ఢీ, క్యాష్‌ వంటి రియాల్టీ షోలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఆగడు పాటల వేడుకను ఘనంగా నిర్వహించిన షో టైమ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ఆగడు ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

Mahesh Babu’s world largest police belt

మరో ప్రక్క ఈ ప్రమోషన్ లో భాగంగా.... ఇటీవలే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ కి సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్ అని టైటిల్ పెట్టి ఆ ట్రైన్ మొత్తం ఆగడు పోస్టర్స్ తో వినూత్నంగా ప్రచారం మొదలెట్టారు. ఈ ట్రైన్ గురించి నిర్మాత మాట్లాడుతూ... "ఈ ట్రైన్ నెల రోజుల వరకూ ఆగడు ఎక్సప్రెస్ గా బ్రాండింగ్ ఉంటుంది. మేము 19 మంది సూపర్ ఫ్యాన్స్ ని సెలక్ట్ చేసి మా యూనిట్ తో పాటు వైజాగ్ తీసుకు వెళ్తాం. అలాగే విన్ అయిన వారందరికీ ఆగడు కిట్స్ కూడా ఇస్తాం. అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు, మా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ సినిమాకు రచన: అనిల్‌ రావిపూడి, ఉపేంద్ర మాధవ్‌, రచనా సహకారం: ప్రవీణ్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, కెమెరా: కె.వి.గుహన్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కోటి పరుచూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X