మహేశ్ షుగర్ ఫ్యాక్టరీ.. రూట్ మార్చిన ప్రిన్స్.. విజయ్ దేవరకొండకు షాక్
వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రిన్స్ మహేశ్‌బాబు రూట్ మార్చినట్టు కనిపిస్తున్నది. మహేశ్ కెరీర్‌ను చూస్తే ఇప్పటి వరకు ఆయన కొత్త దర్శకులతో పని చేసిన దాఖలాలు తక్కువే. తాజాగా అర్జున్‌రెడ్డితో సంచలన విజయం సొంతం చేసుకొన్న సందీప్‌రెడ్డి వంగతో మహేశ్ జతకట్టనున్నారనే వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video


మహేష్ షుగర్ ఫ్యాక్టరీ
అర్జున్‌రెడ్డి చిత్రం తర్వాత షుగర్ ఫ్యాక్టరీ అనే కథను సిద్ధం చేసుకొన్నాడు. మహేశ్‌కు ఆ కథను చెప్పగా ప్రిన్స్ ఓకే చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ వరుస ప్రాజెక్ట్‌లతో ప్యాక్ అయి ఉన్నాడు.

ఆ రెండు సినిమాల తర్వాత
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ ప్రస్తుతం భరత్ అను నేను అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి కాగానే వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాల తర్వాత సందీప్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

విజయ్‌తో సందీప్ సినిమా
ఇదిలా ఉండగా, అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండతోనే షుగర్ ఫ్యాక్టరీ రూపొందించాలని సందీప్ భావించాడట. అయితే మహేశ్‌కు కథ నచ్చడంతో విజయ్‌తో రూపొందించే ఆలోచనను మానుకొన్నాడట. ప్రస్తుతం ప్రిన్స్ ఇమేజ్‌కు అనుగుణంగా మలిచే విధంగా స్క్రిప్ట్ రచన జరుగుతున్నదట.

వచ్చే ఏడాది వేసవికి
వంశీ పైడిపల్లి చిత్రం అక్టోబర్‌లో పూర్తయితే సందీప్ చిత్రం ఆ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. అన్ని సరిగా కుదిరితే సందీప్, మహేశ్ సినిమా వచ్చే ఏడాది వేసవి రేసులో పరుగులు పెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











