సరిలేరు నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండగే

భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఎఫ్2తో వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన అనిల్ రావిపూడితో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేస్తున్న మహేష్.. సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించేందుకు మరోసారి కాసుల వర్షాన్ని కురిపించేందుకు పక్కా ప్రణాళికతో సిద్దమయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్.

ప్రత్యేక పాత్రలతో ఆకర్షించేందుకు ప్రయత్నం

ప్రత్యేక పాత్రలతో ఆకర్షించేందుకు ప్రయత్నం

ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు.. ప్రత్యేక పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు టాక్. అందులో భాగంగానే విజయశాంతి కోసం పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను బలంగా రాసుకున్నట్లు. ఈ క్యారెక్టర్ కోసం ఆమెకు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు సిద్దమైనట్లు టాక్. అయితే ఆ మొత్తం ఎంతా అన్నది బయటకు చెప్పడం లేదు కానీ నిర్మాతకు కళ్లు తిరిగేంత ఉంటుందని సమాచారం. బండ్ల గణేష్‌తో కూడా ఓ కీ రీల్ ప్లే చేయించాడు దర్శకుడు.

ప్రత్యేక ఆకర్షణగా కేరళ అందాలు

ప్రత్యేక ఆకర్షణగా కేరళ అందాలు

ఈ చిత్రంలో కేరళ అందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండోబోతోన్నట్లు టాక్. ఈ ప్రాంతంలో మహేష్, రష్మీకపై చిత్రీకరించే సన్నివేశాలు, పాటలు సినిమాకు మరింత ప్లస్ అవుతాయని సమాచారం. గత కొన్ని రోజులుగా చిత్రబృందం అక్కడి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తోంది.

టీజర్ లోడ్ అవుతోంది..

ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్, ఒక పాట మాత్రమే రిలీజ్ అయింది. పోస్టర్స్‌తోనే ఫ్యాన్స్ కడుపు నింపుతూ ఉన్న టీమ్.. తాజాగా మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీ టీజర్ లోడ్ అవుతోందంటూ అదిరిపోయే జిఫ్ ఫైల్‌ను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో మహేష్ తన గన్‌ను లోడ్ చేస్తుండగా.. టీజర్ కూడా లోడ్ అవుతోందంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

Recommended Video

#CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
సంక్రాంతి బరిలో..

సంక్రాంతి బరిలో..

సరిలేరు నీకెవ్వరు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనిల్ రావిపూడి..తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు. జనవరి 12న విడుదల కానున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాతో పోటీ పడేందుకు రెడీ అయింది. మరి ఈ రెంటిలో విజయం ఏది విజయం సాధింస్తుందో చూడాలి.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X