బాహుబలి లెక్కలు కూడా మటాష్.. మహేష్‌కు ‘సరిలేరు.. టీఆర్పీల్లో సూపర్ స్టార్ కొత్త రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఎంతటి సంచలనాలు నమోదు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలోకి దిగిన మహేష్ బాబు.. బాక్సాఫీస్ దుమ్ములేపేశాడు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ లుక్స్, కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాయి. వెండితెరను షేక్ చేసిన మహేష్.. బుల్లితెరనూ పరుగులు పెట్టించాడు.
Recommended Video

కలెక్షన్ల సునామి..
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్‌లో దుమ్ములేపింది. మహేష్ కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్, షేర్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. వెండితెరపై మహేష్ బాబు చేసిన హల్చల్‌కు బుల్లితెర కూడా ఫిదా అయింది.

టీఆర్పీల్లో సరికొత్త రికార్డ్..
సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రీసెంట్‌గా బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రానికి అత్యధిక టీఆర్పీ రేటింగ్ వచ్చింది. టాలీవుడ్ చరిత్రలోనే ఇంతటి రేటింగ్ రావడం ఇది తొలిసారి. ఈ దెబ్బకు బాహుబలి లాంటి చిత్రాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.

అత్యధిక రేటింగ్‌తో టాప్..
ఇప్పటి వరకు బాహుబలి 2 చిత్రం అత్యధిక టీఆర్పీతో ( 22.7) టాప్‌లో ఉండగా.. సరిలేరు నీకెవ్వరు దాన్ని వెనక్కి నెట్టేసింది. గత వారం బుల్లితెరపై సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ రాగా అదిరిపోయే రేటింగ్ (23.4) వచ్చింది.

టాలీవుడ్ టాప్ 5 ఇవే..
ఇప్పటికే టీఆర్పీలో టాప్ 5గా నిలిచిన చిత్రాలను చూస్తే సరిలేరు నీకెవ్వరు (23.4), బాహుబలి 2 (22.7), శ్రీమంతుడు (22.54), డీజే (21.7), బాహుబలి (21.54) వరుసగా ఉన్నాయి. దీన్ని బట్టే మహేష్ రేంజ్ ఏంటో అర్థమవుతోంది.అయితే క్వారంటైన్, లాక్ డౌన్ ఉండటం వల్లే ఇంతటి రేటింగ్ సాధ్యమైందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











