మహేష్ టాటూ వెనుక అసలు రహస్యం.. సర్కారు వారి పాటలో అదే హైలెట్!

ఒక స్టార్ హీరో క్రేజ్ పెరుగుతున్న కొద్దీ తదుపరి సినిమాలు చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోజుల్లో కమర్షియల్ అంశాలతో పాటు ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ని చూపించకపోతే ఆడియెన్స్ అంత ఈజీగా సంతృప్తి చెందరు. ఇకపోతే మహేష్ బాబు కూడా ఇప్పుడు అలాంటి ఆలోచనతోనే అడుగులు వేస్తున్నాడు. నెక్స్ట్ 'సర్కారు వారి పాట' సినిమాతో కూడా కొత్త సందేశంతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

 అతడే ఎందుకు?

అతడే ఎందుకు?

మహేష్ బాబు పరశురామ్ లాంటి దర్శకుడికి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనేది మొదట అందరిలో ఒక స్పెషల్ ఆలోచనను కలిగించింది. గీత గివిందం సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను అంచనాలకు తగ్గట్లుగా చూపించగలడా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఫస్ట్ లుక్ రికార్డ్..

ఫస్ట్ లుక్ రికార్డ్..

సర్కారు వారి పాట అనే టైటిల్ తోనే ముందు సినిమాకు ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని క్రియేట్ చేశారు. అయితే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అంశం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు మొదటిసారి ఒక రూపాయి బిల్ల టాటూ ఎందుకు వేసుకున్నాడు అనేది ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ లో జస్ట్ ఒక సైడ్ లో కనిపించినందుకే సోషల్ మీడియాలో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.

టాటూ అసలు రహస్యం..

టాటూ అసలు రహస్యం..

రూపాయి టాటూ ఎందుకు వేసుకున్నాడు అంటే.. సినిమా కథ సర్కారు వారి పాట టైటిల్ కి తగ్గట్లుగా బ్యాంక్ కి సంబంధించిన చీటింగ్ సమస్యలపై తిరుగుతుందట. ఇక మొదట మహేష్ డాలర్ కరెన్సీ టాటూ వేసుకోవాలని అనుకున్నాడు. అందుకు కారణం సినిమాను మొదట అమెరికా బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

స్ట్రాంగ్ మెస్సేజ్..

స్ట్రాంగ్ మెస్సేజ్..

అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోవడంతో చిత్ర యూనిట్ కథను ఇండియాకు మార్చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సినిమాలో క్యాసినో అనే కాన్సెప్ట్ కూడా ఉందట. క్యాసినో ప్లేయర్ గా మహేష్ కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరలో గ్రామాలకు సంబంధించిన ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ కూడా ఉంటుందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X