నేనెప్పుడూ కత్తి పట్టుకొని... : మహేష్ బాబు
హైదరాబాద్ : నేనెప్పుడూ కత్తి పట్టుకొని ఇరవై ముప్ఫై మందిని నరుక్కొంటూ వెళ్లలేదు. అలాంటి సన్నివేశాలు నా సినిమాలో ఉండవు అంటూ తేల్చి చెప్పారు మహేష్ బాబు. అలాగే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఒప్పుకొన్నప్పుడు సాహసం చేస్తున్నా.. అనుకోలేదు. ఎందుకంటే ఇది చాలా సేఫ్ సినిమా అని నాకు ముందే తెలుసు అని చెప్పుకొచ్చారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విజయోత్సాహంలో ఉన్న మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ప్రస్తుతం మహేష్ బాబు.... సుకుమార్ సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సినిమా సెట్‌లోనే మహేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... 'దూకుడు', 'బిజినెస్‌మేన్' తరవాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లాంటి కథ రావడం నిజంగానే అదృష్టం. ప్రతి ఒక్కరికీ ఓ టర్న్ తప్పకుండా రావాలి. అది గొప్ప మార్పుని తీసుకొస్తుంది. కొత్తదనం వస్తుంది. కమర్షియల్ కథలు చేస్తూ చేస్తూ.. మధ్యలో 'సీతమ్మ..'లాంటి సినిమా చేయడం మంచిదైంది. 'దూకుడు' సినిమాకి ముందు.. 'సీతమ్మ..' కథ వింటే నా ఆలోచనలు వేరేలా ఉండేవేమో? శ్రీకాంత్ అడ్డాల ఈ కథ చెప్పగానే నచ్చేసింది. దీన్ని తెర మీదకు తీసుకురావడంలో నిర్మాత రాజు ప్రత్యేక దృష్టిపెట్టారు అన్నారు.
మద్యపానం, ధూమపానం... వీటికి సంబంధించిన సన్నివేశాలు నా సినిమాల్లో లేకుండా చూసుకొంటున్నాను. 'సీతమ్మ..'లో కథానాయకుడికి సిగరెట్ కాల్చే అలవాటు ఉందనే విషయం నర్మగర్భంగా చెప్పారు. ఇలాంటి వ్యసనాల్ని తెరపై చూపించకుండా జాగ్రత్తపడాలనుకొంటాను. ధూమపానం అలవాటు చాలా ప్రమాదకరం. పదేళ్లు దానికి బానిసైపోతే.. ప్రాణాలు కూడా పోతాయి. యువతరం ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అన్నారు.
నా వరకూ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు లేకుండా చూసుకొంటా. 'దూకుడు'లో మద్యం సన్నివేశం ఉంది. దర్శకుడు శ్రీను వైట్ల సూచనతో కేవలం వాసన చూసి కిక్ ఎక్కేసినట్టు చూపించాం. ఆ సన్నివేశం తమాషాగా అనిపించింది. ఇక 'సీతమ్మ...'లో సిగరెట్ ముక్కలు విసురుతూ తాగేసి చచ్చిపోండి అనిపించారు శ్రీకాంత్ అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











