పేరు పేరున థాంక్స్ చెబుతూ మహేష్ బాబు ట్వీట్లు
హైదరాబాద్ : మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రానికి సంబంధించిన టీజర్‌తో పాటు, ఆడియో విడుదల సందర్భగా ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమాలకు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా వెలుబుచ్చారు. ఈ సినిమా తన కెరీర్లో మరో మైలురాయి అవుతుందని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.
దర్శకుడు సుకుమార్‌తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, కెమెరామెన్ రత్నవేలు, 14 రీల్స్ సంస్థకు, నిర్మాతలకు పేరు పేరున థాంక్స్ చెబుతూ మహేష్ బాబు ట్వీట్ చేసారు. అందుకు సంబంధించిన ట్వీట్స్ ఇక్కడ చూడొచ్చు. '1-నేనొక్కడినే' చిత్రం ఆడియో ఈ నెల 19న, సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు సినిమా ప్రమోషన్లను తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున్న వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ హిస్టరీలోనే తొలిసారిగా....ఈ చిత్రం ఆడియోను సెలక్ట్ చేసిన థియేటర్లలో లైవ్‌గా ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసారు. ఆడియో వేడుక థియేటర్లలో చూడాలనుకునే వారు రూ. 250 చెల్లిస్తే వారికి టిక్కెట్ తో పాటు నేనొక్కడినే టీషర్టు, క్యాప్ అంద జేస్తున్నారు. వీరిలో కొందరి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మహేష్ బాబును కలిసే అవకాశం కల్పిస్తారు.
'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











